Home Film News Kalyandev: క‌ళ్యాణ్ దేవ్ ట్వీట్‌తో శ్రీజ‌తో విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ..!
Film News

Kalyandev: క‌ళ్యాణ్ దేవ్ ట్వీట్‌తో శ్రీజ‌తో విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ..!

Kalyandev: గ‌త కొద్ది రోజులుగా శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్‌ల వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ్రీజ మొద‌ట ఓ వ్య‌క్తిని వివాహం చేసుకొని కొన్నాళ్ల‌కు అత‌నికి విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కి ఓ బిడ్డ పుట్టాక వీరిద్ద‌రు విడివిడిగా ఉంటున్నారు.ఏవో కార‌ణాల వ‌ల‌న మనస్పర్థలు వచ్చాయని.. దూరంగా ఉంటున్నారని.. అన్నీ కుదుటపడ్డాక మళ్లీ కలుస్తారు అని అంద‌రు భావించారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే వారిరివురు విడాకులు తీసుకున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. అప్పుడ‌ప్పుడు క‌ళ్యాణ్ దేవ్ త‌న సోష‌ల్ మీడియాలో చేసే పోస్ట్‌లు వారి విడాకుల విష‌యంపై క్లారిటీ వ‌చ్చేలా చేస్తుంది.

రీసెంట్‌గా క‌ళ్యాణ్ దేవ్..త‌న పోస్ట్‌లో  ప్రతి వారం నాలుగు గంటల పాటు తన కుమార్తె తో సంతోషంగా ఉంటున్నట్లు తెలియ‌జేశాడు. అంతేకాదు తన కుమార్తె నవిష్కతో హ్యాపీగా ఆడుకుంటున్న దృశ్యాలని  కూడా త‌న పోస్ట్‌లో పొంద‌రుప‌రిచాడు. ఈ పోస్ట్ చూశాక అంద‌రికి వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది. సాధార‌ణంగా  ఏ దంపతులు అయిన‌ విడాకులు తీసుకున్నప్పుడు.. లేదా కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి రూల్స్  అమ‌లు చేస్తుంది. ఇద్ద‌రి వాదోప‌వాద‌న‌లు విన్నాక పిల్లలు ఎక్క‌డ ఉండాలి, ఎవ‌రితో ఉండాలి, ఎంత సేపు ఉండాల‌ని చెబుతుంది. క‌ళ్యాణ్ దేవ్‌తో వారానికి 4గంట‌ల పాటు మాత్రమే ఉంటుందంటే వారిద్ద‌రు విడాకులు తీసుకున్నార‌ని అంద‌రికి క్లారిటీ వ‌చ్చేసింది.

ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక‌లో క‌ళ్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు. శ్రీజ సోలోగా ద‌ర్శ‌న‌మిచ్చింది. చాన్నాళ్లుగా శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్‌లు క‌లిసిన ఫొటోలు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా బ‌య‌ట‌కి రావ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల‌ని చూసి శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకున్నార‌ని అంద‌రు ఓ నిర్ణ‌యానికి అయితే వ‌చ్చారు. ఆ మ‌ధ్య శ్రీజ మూడో పెళ్లికి సంబంధించి కూడా అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. వాటిని కొంద‌రు మెగా ఫ్యాన్స్ ఖండించారు.ఇక కళ్యాణ్ దేవ్  విష‌యానికి వ‌స్తే ఆయ‌న హీరోగా ప‌లు సినిమాలు చేశారు. వాటిలో ఆయ‌న చేసిన  రెండు చిత్రాలు సూపర్ మచ్చి, కిన్నెరసానికి మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో ఇవి రెండు కూడా వ‌చ్చిపోయిన‌ట్టు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...