Home Film News War 2: ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ వార్‌2పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!
Film News

War 2: ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ వార్‌2పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

War 2: ట్రిపుల్ ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న జోరు పెంచాడు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే జూనియ‌ర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి వార్ 2 అనే చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో చాలా ప్రతిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మించబోతున్నాడు. చిత్రంలో హృతిక్ రోష‌న్‌కి విల‌న్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాలో క‌థానాయిక‌ గురించి సోషల్ మీడియాలో మరియు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలుగులో ప‌లు సినిమాల‌లో న‌టించి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న క్రేజీ హీరోయిన్  కియారా అద్వానీ ని ‘వార్ 2’ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.తెలుగులోను, హిందీలోను ఈ భామ‌కి మంచి క్రేజ్ ఉన్న నేప‌థ్యంలో కియారాని హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ని టాక్.   ఈ అమ్మ‌డు నటించడం వల్ల పాన్ ఇండియా రేంజ్ లో అదనపు బలం అన్నట్లుగా నెటిజన్స్  చెప్పుకొస్తున్నారు. ఇక  వార్ 2 సినిమా విష‌యానికి వ‌స్తే చిత్ర‌ షూటింగ్ ను ఈ ఏడాది చివరి నుండి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అప్పటి వరకు ఎన్టీఆర్, కియారా అద్వానీ తాము క‌మిట్ అయిన సినిమాలు పూర్తి చేసే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ చాలా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక కియారా అద్వానీ..  తెలుగు సినిమా ‘గేమ్ ఛేంజర్ చేస్తుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు.  మొత్తానికి వార్ 2 లో హృతిక్ రోషన్.. ఎన్టీఆర్ లతో పాటు కియారా అద్వానీ కూడా చేరడంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా బ‌జ్ క్రియేట్ అయింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...