Home Film News తిరిగి మొదలైన ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్!
Film News

తిరిగి మొదలైన ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్!

Narudi Bratuku Natana resumes today

లాక్ డౌన్ నిబంధనలు ఎత్తి వేసి నేటికి మూడు రోజులు అవుతోంది. ఈ శుభవార్తతో చాలామంది సినీ నిర్మాతలు వెంటనే తమ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అలా ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుని, తెరమీదకు వీలైనంత తొందరగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న మరో సినిమా టీం ‘నరుడి బ్రతుకు నటన’.

నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విమల కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా కథను కూడా సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి అతనే సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా తొందరలనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదే సంవత్సరం విడుదల చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా సెకండ్ వేవ్ కారణంతో ఇంతకాలం షూటింగ్ పనులు నిర్వహించలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నాగ వంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...