Home Film News Klin Kaara: జెండా ఎగుర‌వేసిన రామ్ చ‌ర‌ణ్ కూతురు.. పాప ఎంత ముద్దుగా ఉంది..!
Film News

Klin Kaara: జెండా ఎగుర‌వేసిన రామ్ చ‌ర‌ణ్ కూతురు.. పాప ఎంత ముద్దుగా ఉంది..!

Klin Kaara: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ రామ్ చ‌ర‌ణ్- ఉపాస‌న జంట దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత పండంటి పాప‌కి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. జూన్ 20న ఉపాస‌న పాప‌కి జ‌న్మ‌నివ్వ‌డంతో ఈ విష‌యం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. నేష‌న‌ల్ మీడియా కూడా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులు అయిన విష‌యాన్ని హైలైట్ చేశాయి. ఇక జూన్ 30న చిన్నారికి క్లింకార అనే నామ‌క‌ర‌ణం చేసి ఆ పేరుని ల‌లితా స‌హ‌స్రనామం నుండి తీసుకున్న‌ట్టు చెప్పుకొచ్చారు.  అమ్మగా ప్రమోషన్‌ పొందిన తర్వాత తొలిసారిగా ఉపాసన తన పుట్టింటికి  వెళ్ల‌గా, ఆమె త‌ల్లి మ‌న‌వ‌రాలికి ఘ‌న స్వాగతం ప‌లికింది. అంతే కాదు పాప‌కి దిష్టి తీసిన ప‌ని వాళ్ల‌కి  ఏకంగా రూ. 10 లక్షలు ఇచ్చారట.

మ‌నవరాలు క్లింకార ఇంటికొచ్చిన సందర్బంగా పనివాళ్లకు ఏకంగా రూ. 10 లక్షలు ఇవ్వడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక క్లింకార‌ని ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ డే సెల‌బ్రేష‌న్స్ లో క్లింకార పాల్గొన‌గా, ఆ ఫొటోల‌ని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. అమ్మ‌, తాత‌య్య‌ల‌తో క్లింకార తొలి ఇండిపెండెన్స్ డే సెల‌బ్రేష‌న్స్ అంటూ కామెంట్ పెట్టింది ఉప్సీ. పిక్స్ లో క్లింకార ఫేస్ కొద్దిగా మాత్ర‌మే కనిపిస్తుంది. ఇలా చూసే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పూర్తి ఫేస్ ఎప్పుడు చూపిస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగా వారసురాలు క్లింకారకు సెలబ్రిటీల నుంచి వ‌రుస‌ బహుమతులు అంద‌డం గురించి చాలా వార్త‌లు వ‌చ్చాయి . కొన్ని రోజుల క్రితం యంగ్‌ హీరో శర్వానంద్‌ రామ్‌ చరణ్ కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించ‌గా, ఆ త‌ర్వాత  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్  గోల్డ్‌ డాలర్స్ కానుకగా ఇచ్చారని ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇటీవల ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ కూడా తన కోడలికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారని వార్త‌లు వ‌చ్చాయి.. క్లింకార పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు వచ్చేలా బంగారు అక్షరాలతో డిజైన్‌ చేయించిన పలకను బహుమతిగా ఇచ్చారని, ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింద‌ని అన్నారు. చిరంజీవి కూడా మ‌న‌వ‌రాలికి అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చిన‌ట్టు  స‌మాచారం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...