Home Film News Renu Desai: చితికిపోయిన రేణూ దేశాయ్ కాలి వేలు.. బాధ‌ని పంచుకున్న ప‌వ‌న్ మాజీ భార్య‌
Film News

Renu Desai: చితికిపోయిన రేణూ దేశాయ్ కాలి వేలు.. బాధ‌ని పంచుకున్న ప‌వ‌న్ మాజీ భార్య‌

Renu Desai: ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు పిల్ల‌ల‌కి సంబంధించిన విష‌యాల‌ని సైతం రేణూ షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా త‌న కుమారుడు జిమ్ లో వ‌ర్కవుట్ చేస్తున్న వీడియోని పంచుకుంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇక తాజాగా త‌న కాలి గాయం అయింద‌ని తెలియ‌జేసింది.  రెండు రోజుల క్రితం తన కాలికి తీవ్రమైన గాయం అయింద‌ని చెప్పిన రేణు..  మూడు వేళ్ళు చాలా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఒక వేలు అయితే చాలా చితికిపోయింది అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఈ విష‌యం విన్న త‌ర్వాత ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలంటూ రేణూకి ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.

ఇక రేణూ దేశాయ్ .. ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత పూణేలో పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుంది. ఇప్పుడు  పవన్ కళ్యాణ్  మాజీ భార్య అని అనడాన్ని అస్సలు అంగీకరించ‌డం లేదు. తన పిల్లలను సైతం పవన్ కళ్యాణ్ పిల్లలు అనడానికి కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఆ మధ్య ఓ నెటిజన్.. అకీరాను ‘మా అన్న కొడుకు’ అని  అన్నందుకు రేణూ దేశాయ్ చాలా ఘాటుగా  రియాక్ట్ అయ్యారు. అకీరా తన కొడుకు అని గట్టిగా చెప్పుకొచ్చింది. ఇక తాను ఆ మ‌ధ్య అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పుకొచ్చింది. అనారోగ్యం నుండి బ‌య‌ట‌ప‌డేందుకు మందులు వాడుతున్నాను,  యోగా చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటున్నాను.. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను అని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే ఆ రోగం ఏంట‌నేది మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఇక రేణు దేశాయ్ బ‌ద్రి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కేవ‌లం  నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఇలా పలు విభాగాల్లో పనిచేసి త‌న స‌త్తా చాటుకుంది రేణూ దేశాయ్‌. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వ‌స్తున్న రేణూ దేశాయ్ ఇప్పుడు  రవితేజ పాన్‌ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’తో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా హిట్ అయి, రేణూకి మంచి పేరు వ‌స్తే తిరిగి సినిమాల‌లో న‌టిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...