Home Film News మరో తెలుగు సినిమా రీమేక్ లో బిజీబిజీగా షాహిద్ కపూర్
Film News

మరో తెలుగు సినిమా రీమేక్ లో బిజీబిజీగా షాహిద్ కపూర్

Shahid Remaking Jersey

షాహిద్ కపూర్ బాలీవుడ్ లో ఒక సక్సెస్ఫుల్ హీరో. ఇప్పుడు ఇతని దృష్టి మన తెలుగు సినిమాలపై, ఇక్కడి నటులపై పడినట్లు తెలుస్తోంది. మన దగ్గర ఉన్న టాలెంట్ ని గుర్తించడానికి ఈ హీరో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు. రెండేళ్ల క్రితం మంచి హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమాని, కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ కొట్టాడు. నటుడిగా తనని తాను మరింత ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్పుడు షాహిద్ తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు. అతనికి ఈ సినిమా చాలా నచ్చేసిందట. ముందుగా కథ పరంగా చూస్తే.. ఈ సినిమాని ఇష్టపడటానికి ఒక వ్యక్తిగత కారణం ఉందని చెప్పాడు. అదే – ఈ కథలో క్రికెటర్ అవ్వాలని కలలు గనే ఆటగాడు తన జీవితంలో లేట్ గా సక్సెస్ చూడటం. ఒక సినిమా హీరోగా స్వయంగా ఇండస్ట్రీలో ఆలస్యంగా సక్సెస్ చూసినవాడిగా తను ఈ కథతో బాగా రిలేట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఈ కథలో అతనికి బాగా నచ్చిన మరో విషయం నాని నటన. నాని చాలా అధ్బుతంగా నటించాడని, సినిమాలో కొన్ని సందర్భాలలో చాలా ఎమోషనల్ ఐనట్టు చెప్పాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు కూడా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాల్సి ఉంది. ఐతే తెలుగులో డైరెక్ట్ గౌతం తిన్ననూరినే ఈ హిందీ వెర్షన్ కి డైరెక్షన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ పనులు చూసుకుంటున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...