Home Film News ‘మా’ ఎన్నికల బరిలో తన టీంని ప్రకటించిన ప్రకాష్ రాజ్
Film News

‘మా’ ఎన్నికల బరిలో తన టీంని ప్రకటించిన ప్రకాష్ రాజ్

Prakash Raj announces his team

మా ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. మొదట ఎన్నికల బరిలోకి దిగిన మంచు విష్ణు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాడు. ఆయనకి పోటీగా ప్రకాష్ రాజ్ ముందుకు రావడంతో ఈ సారి మా ఎన్నికలు మరింత ఆసక్తిగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ పోటీని మరింత పెంచుతూ జీవితా రాజశేకర్ లు, నటి హేమలు కూడా ముందుకు వచ్చారు. పోటీ పెరుగుతున్న కొద్దీ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు గెలవబోతున్నారు అనే విషయం ఉత్కంఠని రేకెత్తిస్తుంది.

‘మా’ సంస్థ ద్వారా.. నటీ నటులకు ఎంత సహాయ పడవచ్చో అంతా సహాయ పడే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు ప్రకాష్ రాజ్. తన సత్తా ఏంటో చూపించాలి అంటే కచ్చితంగా ఎన్నిక గెలవాల్సిందే. అందుకే తన టీం ని సిద్ధం చేసుకున్నాడు. వాళ్ళలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తో కచ్చితంగా ఈ ఎన్నికని గెలిచి బాద్యతలు స్వీకరిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీం లో ఉన్న ఆ ప్రముఖులు ఎవరో చూద్దాం.

సహజనటి జయసుధ, హీరో శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్ గారు, సహాయ నటి ప్రగతి, యాంకర్ అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, సహాయ నటుడు బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, యాంకర్ & మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, భూపాల్, సురేశ్ కొండేటి, ఖయ్యుం, జబర్దస్ట్ ఫేమ్ సుడిగాలి సుధీర్ వంటి వాళ్ళున్నారు. వీళ్లందరి సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ ఎన్నికని గెలవబోతున్నారో లేదో వేచి చూద్దాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...