Home Film News Bigg Boss 7 Rules: వామ్మో.. ఈ సారి బిగ్ బాస్ రూల్స్ ఇంత క‌ఠినంగానే.. ఒక్కొక్క‌రికి వాచిపోతుందంతే..!
Film News

Bigg Boss 7 Rules: వామ్మో.. ఈ సారి బిగ్ బాస్ రూల్స్ ఇంత క‌ఠినంగానే.. ఒక్కొక్క‌రికి వాచిపోతుందంతే..!

Bigg Boss 7 Rules: విదేశాల‌లో మొద‌లైన బిగ్ బాస్ షో మ‌న తెలుగు వాళ్ల‌కి బాగానే క‌నెక్ట్ అయింది. తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డంతో షోకి మంచి పాపులారిటీ ద‌క్కింది. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన సీజ‌న్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, సీజ‌న్ 6 మాత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ఈ సారి నిర్వాహ‌కులు లోటు పాట్ల‌ని స‌రిదిద్ది స‌రికొత్త‌గా షోని ప్ర‌జెంట్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా,ఈ ప్రోమోతో త్వ‌ర‌లోనే షో మొద‌లు కానుంద‌ని భావిస్తున్నారు. అయితే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవ‌రు, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.

బిగ్ బాస్ సీజ‌న్ 7కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా ఉంటార‌ని తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్స్ గా బుల్లితెర‌పై మంచి క్రేజ్ అందుకున్న‌ అమర్ దీప్.. తన భార్య తేజస్వినితో కలిసి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నోయెల్.. తన మాజీ భార్య ఈస్టర్ సైతం షోలో పాల్గొన‌బోతున్న‌ట్టు స‌మాచారం.ఇక  కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ, రష్మి, ప్రియా, సాయి రోనాక్, సిద్ధర్థ్ వర్మ, ఢీ పండు, నిఖిల్, సాకేత్ కొమండూరి, మహేష్ బాబు, కాళిదాసు, జబర్ధస్త్ అప్పారావు, మోహన శోభరాజు ఇలా పలువురు బిగ్ బాస్ సీజ‌న్ 7లో సంద‌డి చేయ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. బ్యాంకాక్ పిల్ల‌ని కూడా బిగ్ బాస్ షోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక సీజ‌న్ 7లో రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయ‌ట‌. తేడా వ‌స్తే హౌజ్ నుండి బ‌య‌ట‌కి పంపిస్తార‌ట‌.  గొడవలు పెట్టుకొని పొరపాటున నోటి నుండి ఒక్క బ్యాడ్ పదం బయటికి వచ్చినా స‌రే  కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేస్తారట. ఇక మ‌రీ అతిగా రొమాన్స్ చేసి  ప్రేక్షకులకు ఎంత ఇబ్బంది కలిగించ‌కుండా ప్ర‌త్యేక‌ చర్యలు చేపడుతున్నారట. ఒకవేళ హద్దులు దాటి రొమాన్స్ చేసినా రెడ్ కార్డు ఇచ్చి పంపిస్తారని తెలుస్తుంది. కావాల‌ని ఒకరి మీద ఒకరు ఉద్దేశపూర్వకంగా ఫిజికల్ దాడి చేసుకున్నా కూడా రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిస్తార‌ని స‌మాచారం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...