Home Film News Raksha Bandhan Trailer : ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘రక్షాబంధన్’ ట్రైలర్ అదిరింది
Film News

Raksha Bandhan Trailer : ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘రక్షాబంధన్’ ట్రైలర్ అదిరింది

Raksha Bandhan Trailer
Raksha Bandhan Trailer

Raksha Bandhan Trailer: చేసే ప్రతి సినిమాలోనూ కథ పరంగా, క్యారెక్టర్ పరంగా వైవిధ్యత చూపించాలను తాపత్రయపడే యాక్టర్స్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుంటారు. హిందీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ.. ఏడాదిలో ఎక్కువ రిలీజులు చేసేది కూడా అక్షయ్ కుమారే..

అక్షయ్, భూమి ఫడ్నేకర్ జంటగా.. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘రక్షాబంధన్’.. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సింపుల్‌గా స్టోరీ ఇదే అనిపిస్తుంది కానీ.. మనసుకి హత్తుకునేలా ఎంత బాగా తీశారో.. తప్పకుండా చూడాలి అని కూడా అనిపిస్తుంది.

చెల్లెళ్ల పెళ్లి కోసమే కష్టపడే అన్న క్యారెక్టర్‌లో అక్షయ్ నటన ఆకట్టుకుంటుంది. తన మార్క్ కామెడీతో పాటు ఎమోషన్స్ క్యారీ చేస్తూ కంటతడి పెట్టించారు అక్షయ్. నలుగురు చెల్లెళ్లు, అరకొర సంపాదన, మరోవైపు తనకి కాబోయే భార్యని వెయిట్ చేయించడం.. ఇన్ని సమస్యలని హీరో ఒక్కడే ఎలా పరిష్కరించుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు మాజీ కోడలు కనికా థిల్లాన్, హిమాన్షు శర్మ ఈ కథ రాశారు. జీ స్టూడియోస్, అల్కా హీరానందానీతో పాటు డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 11న ‘రక్షాబంధన్’ వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...