Home Film News 33 సంవత్సరాల నాగార్జున శివ సినిమా వెనక ఎవరూ ఊహించని స్టోరీ ఇదే..!
Film NewsSpecial Looks

33 సంవత్సరాల నాగార్జున శివ సినిమా వెనక ఎవరూ ఊహించని స్టోరీ ఇదే..!

అక్కినేని నాగార్జున కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలలో శివ సినిమా కూడా ఒకటి… సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమా కూడా ఇదే.. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని తిరగరాసి బంపర్ హిట్ గా నిలిచింది. నాగార్జునను టాలీవుడ్ లోనే మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా కూడా ఇదే.

ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే సైకిల్ చైన్ ట్రెండ్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.. అప్పటి యువతకు ఈ సైకిల్ చైన్ ట్రెండ్‌ బాగా కనెక్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇప్పటికీ ఈ సినిమాలోని మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ వ‌చ్చే పాట‌ నేటి తరం ప్రేక్షకుల‌ను కూడా బాగా మెప్పిస్తుంది. ఇక దర్శకుడిగా వర్మ సినిమాకి వాడిన కెమెరా యాంగిల్స్ ప్రస్తుతం కొత్తగా వచ్చే దర్శకులకు ఫిలిం స్కూల్లో టీచింగ్ కోసం ఉపయోగించవచ్చు అంత ప్రతిభని సినిమాలో చూపించాడు వర్మ. ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు వ‌చ్చి 33 సంవత్సరాల అవుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇచ్చిన ఇంపార్టెంట్ అంతా ఇంతా కాదు.

శివ సినిమా చైన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

అప్పటివరకు ఉన్నమూస ఫైట్లు, డ్యాన్స్‌లు, రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌ ‘శివ’ తీసుకువచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అంతెందుకు పోస్టర్ డిజైనింగ్‌లో కూడా ‘శివ’ మూవీ తన కొత్త పంథాను చాటుకుంది. ఈ సినిమా విడుద‌లై నేటితో 33 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే ఆ సినిమా గొప్పదనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ అప్పట్లో న్యూ జనరేషన్ రచయితలకు, డైరక్టర్లకు ఒక టెక్ట్ బుక్‌లా మారింది. ఈ సినిమాతోనే బెజవాడ రౌడీయిజాన్ని తొలి సారి వెండితెరపై ఆవిష్కరించాడు వ‌ర్మ‌. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త నాగార్జున జీవిత భాగస్వామిగా అమలను చేసింది.

 

 

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...