Home Film News హాయ్ నాన్న మూవీ రివ్యూ…ఈ ఏడాదిలోనే బెస్ట్ సినిమా ఇదే..!
Film NewsReviews

హాయ్ నాన్న మూవీ రివ్యూ…ఈ ఏడాదిలోనే బెస్ట్ సినిమా ఇదే..!

టైటిల్‌: హాయ్ నాన్న‌
నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శి తదితరులు
దర్శకుడు : శౌర్యవ్‌
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
మాటలు: నాగేంద్ర కాశీ
సినిమాటోగ్ర‌ఫీ : సాను జాన్ వర్గీస్
మ్యూజిక్ : హేషమ్ అబ్దుల్ వహాబ్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 6, 2023
సెన్సార్ రిపోర్ట్ : క్లీన్ యు

నాచురల్ స్టార్ నాని దసరా వంటి ఉర‌ మాస్ పాన్ ఇండియా హిట్ తరవాత పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్గా, అలాగే బేబీ కియారా ఖన్నా మరో ముఖ్యపాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించిందో ఇక్కడ చూద్దాం.

కథ :
విరాజ్ (నాని) ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్.. ముంబైలో ఓ ఫోటో స్టూడియోని నడుపుతూ ఉంటాడు.. వీరాజ్ తన కూతురు మహి (బేబీ కియారా)తో కలిసి ఉంటాడు.. అయితే మహికి ఓ అరుదైన అనారోగ్య సమస్యతో భాద ప‌డుతుంది.. ఎక్కువ రోజులు బతకదు అని డాక్టర్స్ చెప్పినా.. మహి తనను వదిలి వెళ్ళదు అని బలంగా నమ్ముతుంటాడు విరాజ్. మరోవైపు తన ప్రొఫెషన్ లో ఎంతో బిజీగా ఉన్నా తన కూతురు కోసం ఎప్పుడు టైం కేటాయిస్తాడు. అలాగే ఆమెకు అందమైన కథలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తాడు.. తనకు ఎలాంటి కథ చెప్పనా అందులో పాత్రను ఊహించుకోవడం మాయా కి అలవాటు.

Nani on Hi Nanna: హాయ్ నాన్న మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది: నాని-nani says hi nanna music will sweep you off your feet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

అమ్మ కథలు చెప్పట్లేదని మారం చేస్తుంది.. నువ్వు ముందు నీ చదువులో ఫస్ట్ వస్తే కథ చెప్తాను అంటాడు విరాజ్.. తన తండ్రి చెప్పిన విధంగానే తన చదువులు ఫస్ట్ వస్తుంది మాయ.. విరాజ్‌ అమ్మ గురించి స్టోరీ చెప్పపోవడంతో మాయ అలుగుతుంది. విరాజ్ మాత్రం తన భార్య గురించి కూతురికి చెప్పడు. అసలు విరాజ్ భార్య ఎవరు ?, ఆమె ఎందుకు విరాజ్ ను వదిలేసింది ?, అంతలో విరాజ్ జీవితంలోకి యశ్న ( మృణాల్‌ ఠాకూర్‌ ) వస్తోంది ?, ఇంతకీ, యశ్న (మృణాల్‌ ఠాకూర్‌ ) ఎందుకు విరాజ్ కి, అతని కూతురికి బాగా ద‌గ్గ‌ర‌వుతుంది ?, ఆమె గతం ఏమిటి ?, చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేష‌ణ :
మన టాలీవుడ్ లో కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చే హీరోలలో నాని కూడా ఒకరు.. కొత్త దర్శకులు తమ తొలి సినిమా కోసం ఎంతో మనసుపెట్టి పని చేస్తారన్నది నిజం. అందుకే కొత్త దర్శకుల‌ నుంచి వచ్చిన ఎక్కువ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక్కడ కారణం ఏదైనా కావచ్చు.. నాని కొత్త దర్శకులను ఎంపిక చేసుకున్నీ మంచి సినిమాలనే చేస్తున్నాడు. శౌర్యవ్‌ హాయ్ నాన్న సినిమా కోసం తన ప్రాణం పెట్టి పని చేశారనే చెప్పాలి.. ఈ సినిమా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. స్టోరీ కొత్తది కాకపోయినా కథను సినిమాగా మలిచిన విధానం.. ఈ కథను ప్రేక్షకులకు చూపించిన విధానం మాత్రం ఎంతో కొత్తగా ఉంటుంది.

స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు కష్టం సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాలో వచ్చే ప్రతి షాట్‌ సీను అద్భుతంగా తీర్చీ దిదారు. ఈ సినిమాకు పని చేసిన అన్ని విభాగాల నుంచి మంచిఅవుట్‌పుట్‌ను రాబట్ట కలిగారు. మరి ముఖ్యంగా నటీనటుల నుంచి యాక్టింగ్ పిండేసారనే చెప్పాలి. ఈ సినిమాలో వచ్చే డైలాగ్ ల గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చిన రోజు నుంచి ఈ మూవీ డైలాగ్ లు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి.‘‘ ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోవట్లేదా మహి’’ వంటి డైలాగులు ‘హాయ్‌ నాన్న’లో చాలా ఉన్నాయి. సినిమాతో కనెక్ట్‌ అయిన వారికి రెండున్నర గంటల సినిమా ఇట్టే గడిచిపోతుంది. అప్పుడే మూవీ అయిపోయిందా అనిపించేలా హాయ్‌ నాన్న ఉంటుంది.

నటీనటుల నటన :
రొమాంటిక్‌ ఫ్యామిలీ సినిమాలంటే ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేక్షకులు కనెక్ట్‌ కావాలన్నా.. కథతో పాటు ట్రావెల్ చేయ‌ల‌న్నా.. నటీనటుల నటన ఎంతో మూఖ్యం. నటన విషయంలో నాని, మృణాల్‌తో సహా ఎవ్వరూ తగ్గలేదు. దిబెస్ట్ గా తెరపై న‌టించిరు. కీలక సన్నివేశాలలో నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నాలు నటించారు అనటం కంటే.. ఆ పాత్రల్లో జీవించారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సన్నివేశాలలో వారి నటనకు మన కళ్లల నుంచి నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కీలక పాత్రలో నటించిన జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శితో పాటు మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఎంతో అద్భుతంగా నటించారు.

Nani 30 Is Hi Nanna! Natural Star Nani and Mrunal Thakur's Glimpse From Shouryuv's Upcoming Family Entertainer Will Leave You Intrigued (Watch Video) | 🎥 LatestLY

సాంకేతిక విభాగం :
ఇక ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే..శౌర్యవ్‌ దర్శకుడిగా మంచి కథాతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆయన టేకింగ్ కూడా ఎంతో బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం శౌర్యవ్‌ కొంచెం తడబడ్డారుని చెప్పాలి. సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌ అందించిన పాటలు ఎంతో బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. షను వర్గీస్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ విలువలు చాలా రీచ్చ్‌గా కూడా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా :
ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న.. ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో పాటు డీసెంట్ గా సాగే ఫాదర్ – డాటర్ సెంటి మెంట్‌ మరియు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. అయితే, ఈ సినిమాలో కొన్ని సీన్లు స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ గా నిలిచాయి. కాకపోతే, నాని – మృణాల్ తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. మ‌రి ముఖ్యంగా వారీ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మొత్తంగా హాయ్ నాన్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని చెప్పాలి.

చివరి మాట: హాయ్ నాన్న ప్రతి తండ్రి మనసును హత్తుకునే ఓ మంచి కథ …

హాయ్ నాన్న రేటింగ్ : 3/5

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...