Home Film News Bhola Shankar : కీర్తి సురేష్ బాయ్‌ఫ్రెండ్‌‌‌గా నితిన్
Film News

Bhola Shankar : కీర్తి సురేష్ బాయ్‌ఫ్రెండ్‌‌‌గా నితిన్

Nithin
Nithin

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యమా స్పీడ్ మీదున్నారు. ‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజాతో ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు చేస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ తెలుగు రీమేక్‏గా ‘భోళా శంకర్’ మూవీ తెరకెక్కుతోంది. చిరంజీవి నటిస్తున్న 155వ సినిమా ఇది..

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‏గా, కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటిస్తున్నారు.. AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఆధారంగా రూపొందుతున్న ‘భోళా శంకర్’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా గురించి ఫిలింనగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. యంగ్ హీరో నితిన్ ‘భోళా శంకర్’ లో యాక్ట్ చెయ్యబోతున్నాడట. అది కూడా చిరంజీవి చెల్లెలిగా చేస్తున్న కీర్తి సురేష్ బాయ్‌ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో అని వార్తలు వినిపిస్తున్నాయి.

స్వతాహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అయిన నితిన్.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం రావడంతోత ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నాడట. మూవీ టీం త్వరలో ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...