Home Film News Kallu Chidambaram: ఒకప్పుడు మంచిగా ఉండే క‌ళ్లు చిదంబ‌రం నేత్రాలు అలా ఎందుకు అయ్యాయంటే..!
Film News

Kallu Chidambaram: ఒకప్పుడు మంచిగా ఉండే క‌ళ్లు చిదంబ‌రం నేత్రాలు అలా ఎందుకు అయ్యాయంటే..!

Kallu Chidambaram: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని పాపుల‌ర్ క‌మెడీయ‌న్స్‌లో క‌ళ్లు చిదంబరం ఒక‌రు. క‌ళ్లు అనే సినిమాలో అద్భుత న‌ట‌న క‌న‌బ‌ర‌చి ఆ సినిమాతోనే క‌ళ్లు చిదంబ‌రంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న కామెడీ స‌న్నివేశాలే కాకుండా సీరియ‌స్ పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించాడు. అమ్మోరు లాంటి సినిమాలో ఎంతో సీరియస్‌గా కనిపించి భ‌య‌పెట్టించిన క‌ళ్లు చిదంబ‌రం  తన మెల్ల కన్నుతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అయితే అది పుట్టుకతో వచ్చిన మెల్ల కన్ను కాదనే విష‌యం కొంద‌రికే తెలుసు. ఓ సంద‌ర్భంలో ఆయన త‌న‌యుడు త‌న నాన్న క‌ళ్లు ఎలా అయ్యాయో తెలియ‌జేసి ఓ క్లారిటీ ఇచ్చాడు.

నాన్న గారికి ఆరో తరగతి నుంచి నాటకాలు అంటే ఇష్టం..   పోర్టులో ఎంప్లాయ్‌గా ప‌ని చేస్తూనే .. నాటకాలను ఎక్కువగా అరేంజ్ చేసేవారు.. అలా అందరికీ పని కూబి కల్పించేవారు.. నాటకాలు వేస్తూ వేస్తూ చాలా సేవలు చేస్తూ ఉన్న నేప‌థ్యంలో టైంకి సరిగ్గా తిండి లేక, నిద్ర కూడా పోక‌పోవ‌డం వల్ల ఒక చిన్న నరం అలా పక్కకి జరగడంతో మెల్ల కన్ను వచ్చింది. అయితే దానిని స‌రిచ‌యోచ్చు అని డాక్ట‌ర్స్ కూడా చెప్పారు. కాని ఉద్యోగం, నాటకాలు ఇలా బిజీగా బిజీగా ఉండటంతో ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోలేదు.. తరువాత చూద్దాం తరువాత చూద్దాం అని నిర్లక్ష్యం చేయడంతో  అది మ‌రింత ఎక్క‌వైంది.

ఓసారి  నాన్న‌గారి  కళ్లు నాటకాన్ని చూసిన ఎంవీ రఘు కళ్లు సినిమాకు తీసుకోగా, ఆ సినిమా త‌ర్వాత   మెల్ల కన్ను సరిచేద్దామని అనుకున్నారు. కానీ అదే కలిసి వచ్చిందని  స‌రి చేసుకోకుండా అలా ఉంచేశారు. ఇక సినిమాల విష‌యంలో కూడా ఒక సినిమా చేసిన ఆపేయాల‌ని అనుకున్నారు.  కాని ఆ తరువాత ముద్దుల మావయ్య అనే సినిమా  అవ‌కాశం రావ‌డంతో, రెండో చిత్రం చేసేసి  ఆపేయాల‌ని భావించారు. కానీ అలా వరుసగా సినిమాలు రావ‌డం,  డిపార్ట్మెంట్ వాళ్లు కూడా హెల్ప్ చేయడంతో సినిమాల్లోనే కంటిన్యూ  అవుతూ వ‌చ్చార‌ని చిదంబరం త‌న‌యుడు అన్నాడు. క‌ళ్లు చిదంబరం తన తుది శ్వాస వరకు కూడా తన జీవితాన్ని నాటక రంగానికి, సేవా కార్యక్రమాలకు, పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...