Home BoxOffice సినీ ప్రేమ కథల్లో ‘తొలిప్రేమ’ ఒక క్లాసిక్, 23 ఏళ్ల ఈ మూవీ బాక్సాఫీస్ మాటేమిటి?!
BoxOffice

సినీ ప్రేమ కథల్లో ‘తొలిప్రేమ’ ఒక క్లాసిక్, 23 ఏళ్ల ఈ మూవీ బాక్సాఫీస్ మాటేమిటి?!

23 Years For Classic Tholi Prema

పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొదలెట్టిన రోజులివి. ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ మెగా హీరోకి వచ్చిన అధ్బుతమైన అవకాశం తొలిప్రేమ సినిమా. ఈ అవకాశాన్ని చాలా తెలివిగా తనని తాను ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ చేసుకోడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నాడని చెప్పవచ్చు. కథాబలం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో మూవీ పెద్ద సక్సెస్ ని చూసింది. మ్యూజిక్ కూడా పెద్ద సంచలనమే అయిందని చెప్పాలి.

తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డ్ తీసుకుంది ఈ మూవీ. అలాగే 1998 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైంది. అలాగే మొదటి సినిమాతోనే ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణాకరన్. హిందీ, కన్నడ రెండు భాషల్లోకి రీమేక్ అయింది ఈ మూవీ. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కి మంచి స్టార్ డం వచ్చిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత 2001 వరకు పవన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ హిట్లుగా మారాయి. అంతలా ఫాలోయింగ్ సంపాదించారు పవన్.

దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 32 కోట్లు సంపాదించింది. హిట్ టాక్ రావడంతో అప్పటి యువత సినిమాని బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. 21 సెంటర్లలో 100 రోజులు, 2 సెంటర్లలో 200 రోజులు, అలాగే ఒక సెంటర్ లో 365 డేస్ కూడా సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....