Home Film News Jailer Review: ‘జైలర్’ మూవీ రివ్యూ…ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్‌
Film NewsReviews

Jailer Review: ‘జైలర్’ మూవీ రివ్యూ…ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్‌

Jailer Review: సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన మూవీ జైలర్.. మాసివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ నుండి గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వకపోవడంతో అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఈ జైలర్ మూవీ రిలీజ్ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

స్టోరీ : టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) ఒక జైలర్. తన జైలు లో ఉన్న ఖైదీలను క్రమశిక్షణ లో పెట్టి, వాళ్ళని తన కంట్రోల్ లో పెట్టుకునే రేంజ్ ఉన్నవాడు. ఆయన సిస్టమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని క్రాస్ చేసేవారు ఎవ్వరు ఉండరు. టైగర్ ముత్తువేల్ తన ఫ్యామిలీ లైఫ్ ని చాలా ప్రశాంతంగా గడుపుతారు. ఓ రోజు తన జైలులో నుండి ఓ గ్యాంగ్ స్టర్ ని తప్పిస్తుంటే ముత్తువేల్ వాళ్లను అడ్డుకుని మళ్లీ జైలుకు పంపుతాడు. ఆ పగను మనసులో పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ ఫ్యామిలీపై ఎటాక్ చేస్తారు. తన కొడుకుని చంపేయడంతో తన కొడుకుని చంపిన వారిపై పగ సాధించడానికి ముత్తువేల్ ఏం చేశాడు అనేది స్టోరీ.

నటీనటులు: జైలర్ మూవీ రజనీకాంత్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ సినిమా మొత్తంలో ఒక టూ మినిట్స్ మాత్రమే సినిమా స్టార్టింగ్ లో కనిపిస్తారు. మూవీ కూడా స్టార్టింగ్ లో స్టోరీలోకి వెళ్లకపోవడంతో చాలా స్టోగా సాగుతుంది. అలా ఒక 40 మినిట్స్ చాలా స్లోగా ఉంటుంది. బట్ ఆ తర్వత నుండి రజనీకాంత్ విశ్వరూపం చూపిస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ మైండ్ ని అలా బ్లాస్ట్ చేసింది. మెయిన్ ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పొచ్చు. ఇక సినిమా అంతా రజనీకాంత్ హ్యాండిల్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. తమన్నా, మోహన్ లాల్, సునీల్ వీరంతా సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తారు. వీళ్ల పాత్రల డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వీళ్ల పాత్రలు వచ్చినంత సేపు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా జైలర్ గెటప్ లో రజనీ స్టైల్ వేరే లెవెల్. ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఆడియన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా. ఇదే కదా సూపర్ స్టార్ నుండి ఎక్స్ పెక్ట్ చేసింది అనేలా ఉంది మూవీ.

ఇక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ టేకింగ్ అదుర్స్.. రజనీకాంత్ ను ఓ రేంజ్ లో చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా సెట్ అయ్యింది. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

రజనీకాంత్ యాక్టింగ్
అనిరుధ్ మ్యూజిక్
డైరెక్షన్
సెకండాఫ్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
కొన్ని లాగ్ సీన్స్

చివరిగా:
సూపర్ స్టార్ రజనీకాంత్.. జైల‌ర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నట్లే. రజనీకాంత్ ఫ్యాన్స్ కి కూడా జైలర్ మూవీ మంచి ఫీస్ట్ అందించడం ఖాయం.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...