Home Film News Mahesh Daughter: లంగా ఓణీలో క్యూట్ డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న మ‌హేష్ కూతురు.. సాయి ప‌ల్ల‌విని మ‌రిపించిందిగా..!
Film News

Mahesh Daughter: లంగా ఓణీలో క్యూట్ డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న మ‌హేష్ కూతురు.. సాయి ప‌ల్ల‌విని మ‌రిపించిందిగా..!

Mahesh Daughter: తెలంగాణ జాన‌ప‌దానికి సుద్దాల అశోక తేజ కొత్త బాణీలు అద్ది సారంగ‌ద‌రియా అనే పాట‌ని ల‌వ్ స్టోరీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చాడు. ఈ పాట‌కి మంగ్లీ అద్భుత‌మైన గానం అందించ‌గా, సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్ తో చించి ఆరేసింది. ఈ పాట కొద్ది రోజుల క్రితం ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ పాట‌ను వింటూ, దానికి డ్యాన్స్ లు చేస్తూ రీల్స్ చేశారు. ఫిదా అయిపోతున్నారు.  సారంగ ద‌రియా పాట క్రేజ్ ఎల్ల‌లు కూడా దాటేసింది. ఎక్క‌డో ఉన్న‌ కొరియా వాసుల‌ను కూడా ఈ పాట ఆకర్షించింది. ఓ కొరియ‌న్ యువ‌తిఈ పాట పాడ‌డం, ఆ వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డం జ‌రిగింది.ఇక ఇప్పుడు ఈ పాట‌కి మ‌హేష్ ముద్దులు కూతురు సితార డ్యాన్స్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

సినిమాల్లోకి రాకుండానే యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో ఫుల్ పాపులరైన సితార‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.త‌న తండ్రి సినిమాల‌లోని పాటలు పాడ‌డం, వాటికి డ్యాన్స్ లు చేయ‌డం వంటివి చేసిన సితార  తాజాగా ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని ‘సారంగదరియా’ సాంగ్‌కు  అద్భుతంగా డాన్స్ చేసి అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొందుతుంది. సితార రీసెంట్‌గా ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పాటలో చిన్నారి పెర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సాయి ప‌ల్ల‌వి మాదిరిగా డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం. కానీ సితార మాత్రం చేసి చూపించింది. త‌న‌ డాన్స్ టాలెంట్ చూసిన ఫ్యాన్స్ అయితే అబ్బురపడుతున్నారు. సితార నువ్వు సూపర్ అంటూ కొనియాడుతూ నెట్టింట కామెంట్స్ చేశారు.  ప్ర‌స్తుతం ఈ చిన్నారి యానీ మాస్టర్ వద్ద  డాన్సుకి సంబంధించి  శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. ఏది ఏమైన‌ సితార చిన్నప్పటి నుండి కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...