Home Film News Tamannaah: త‌మ‌న్నాతో ఎఫైర్ ఎందుకు సీక్రెట్‌గా ఉంచాల్సి వ‌చ్చిందో చెప్పిన విజ‌య్
Film News

Tamannaah: త‌మ‌న్నాతో ఎఫైర్ ఎందుకు సీక్రెట్‌గా ఉంచాల్సి వ‌చ్చిందో చెప్పిన విజ‌య్

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పెళ్లి గురించి, ఆమె ప్రేమాయ‌ణం గురించి కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌చారాలు జ‌రుగుతూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్ని ప్రచారాలు జ‌రిగినా, ఎన్ని పుకార్లు వ‌చ్చిన కూడా త‌మ‌న్నా ఏ మాత్రం స్పందించేది కాదు. కాని రీసెంట్‌గా ల‌వ్ స్టోరీ 2 ప్ర‌మోష‌న్స్ లో విజయ్ వ‌ర్మ‌తో గాఢమైన ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా విజయ్ వర్మ సైతం త‌మ ప్రేమాయ‌ణంపై స్పందించాడు. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పిన విజయ్ వ‌ర్మ‌.. త‌మ‌న్నా తన జీవితంలోకి వచ్చాక ఎంతో సంతోషం నిండిందన్నారు. . ప్రజలకు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే చెప్పద‌ల‌చుకున్నాను. పర్సనల్ లైఫ్ గురించి సమయం వచ్చినప్పుడు బ‌య‌ట పెట్టాల‌ని అనుకున్నాను. అందుకే తమన్నాతో నా ప్రేమ విషయం ఏనాడు బయటపెట్టలేదు’ అని విజ‌య్ తెలిపాడు

ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందిని తెలియ‌జేశాడు విజ‌య్ వ‌ర్మ‌. ఇక త‌మ‌న్నా ఇటీవ‌ల త‌న ప్రేమ గురించి స్పందిస్తూ.. చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని అనుకుంటారు. అంద‌రిలానే నేను అనుకున్నాను. అలాగే విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకొని వ‌చ్చాడు. నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తి నాతో ఉండ‌డం నా అదృష్టం. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుందని బావిస్తున్నాను.. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా నేను అనుకుంటున్నాను అని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.

కాగా, 2023 సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలకు గాను తమన్నా, విజయ్ వర్మ గోవా వెళ్లారు. ఆ స‌మ‌యంలో తమన్నా, విజయ్ వర్మ లిప్ కిస్ పెట్టుకునే రొమాంటిక్ వీడియో లీక్ కావడంతో అసలు విషయం బయటపడింది. హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ సీజన్ 2 షూటింగులో వీళ్ళిద్దరికీ పరిచయం అయ్యిందని, అప్పుడే ప్రేమలో పడ్డారని స‌మాచారం. కాగా, ఈ అమ్మ‌డు గ‌తంలో ముంబైకి చెందిన ఎవరో వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారని ఆయ‌న‌తో పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా రెడీ అయ్యారని రూమర్స్ వచ్చాయి. వాటిని తమన్నా ఖండించింది. త్వ‌ర‌లో విజ‌య్ వ‌ర్మ‌తో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ అమ్మ‌డు త్వర‌లో భోళా శంక‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...