Home Film News Ashu Reddy: హెచ్చరించిన కూడా అషు రెడ్డి ఫోన్ నెంబర్ లీక్.. సెకనుకో కాల్..!
Film News

Ashu Reddy: హెచ్చరించిన కూడా అషు రెడ్డి ఫోన్ నెంబర్ లీక్.. సెకనుకో కాల్..!

Ashu Reddy: క‌బాలి చిత్ర నిర్మాత డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌గా, ఆయ‌న‌ని  విచారించిన పోలీసులు అనేక విష‌యాలు రాబ‌డుతున్నారు. ముఖ్యంగా అత‌నితో ట‌చ్‌లో ఉన్న వారిపై ఆరాలు తీయ‌గా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి అత‌నితో వంద‌ల ఫోన్ కాల్స్ మాట్లాడిన‌ట్టు ఉంది.  దీంతో ఆమెని కూడా త్వ‌ర‌లో విచారించే అవ‌కాశం ఉంది. అయితే ఫోన్ మాట్లాడితే డ్ర‌గ్స్ తీసుకున్నట్టా అని అషూ ఇటీవ‌ల ప్ర‌శ్నించింది. కొంద‌రు కావాల‌నే నా పరువు తీస్తున్నారు. నాకు డ్ర‌గ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. నా ఫోన్ నెంబ‌ర్ క‌నుకు బ‌హిరంగంగా పెడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. అయిన‌ప్ప‌టికీ అషూ రెడ్డి ఫోన్ నెంబర్ లీక్ అయింది.

తాజాగా మ‌రోసారి స్పందించిన అషూ రెడ్డి.. గ‌త రెండు మూడు రోజులుగా ఓ న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతోంది. అందులో నా పేరు పెట్టి కొన్ని  న్యూస్ ఛానళ్లు ఓపెన్ గా నా నంబర్ వేశారు. ఇలా నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయడం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. ఆ కేసుతో , నాకు ఎంత సంబంధం ఉంది? అనేది నేనూ చెప్పగలను. నావి వందల కొద్దీ ఫోన్ కాల్స్ ఉన్నాయని, గంటల కొద్దీ సంభాషణలు అని చెబుతున్నారో? అందులో నిజం లేదు అని అషు రెడ్డి చెప్పుకొచ్చింది. అది త‌ప్పు అని నేను ప్రూఫ్ చేయించ‌గ‌ల‌ను. అయితే ఈ స‌మ‌యంలో నేను సైలెంట్ ఉంటే ఆరోప‌ణ‌లు నిజం అని ఒప్పుకున్న‌ట్టు అవుతుంది.

ఎంత మౌనంగా ఉండాల‌నుకున్నా కూడా నా వ‌ల‌న కావ‌డం లేదు. కొద్ది రోజులుగా చాలా మాన‌సిక వేద‌న అనుభ‌వించారు. అస‌లు నిజం ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు వార్త‌లు రాస్తున్నారు. ఎవ‌రి నోటికి వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నారు. అలాంటి వారిపై త‌ప్ప‌క   పరువు నష్టం దావా కేసు వేస్తా” అని అషు రెడ్డి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. అషూ రెడ్డి జూనియ‌ర్ స‌మంత‌గా కెరీర్ మొద‌ట్లో గుర్తింపు తెచ్చుకొని ప‌లు టీవీ షోలు, బిగ్ బాస్ షోల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ గోపాల్ వ‌ర్మ‌తో చేసిన ఓ ఇంట‌ర్వ్యూ కూడా సంచ‌ల‌నం రేపింది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...