Home Film News Pics Deleted: మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు.. ఫొటోలు డిలీట్ చేయ‌డంతో పుట్టుకొచ్చిన అనుమ‌నాలు..!
Film News

Pics Deleted: మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు.. ఫొటోలు డిలీట్ చేయ‌డంతో పుట్టుకొచ్చిన అనుమ‌నాలు..!

Pics Deleted: ఇటీవ‌ల సెలబ్రిటీల విడాకులు కామ‌న్‌గా మారాయి. ఏవో మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న పెళ్లైన కొద్ది రోజుల‌కే విడాకులు తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నిండునూరేళ్లు క‌లిసి ఉండాల్సిన జంట‌లు పెళ్లై ఐదేళ్లు కాకుండానే విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల విడాకులకి ముందు సోష‌ల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేయ‌డం ట్రెండింగ్‌గా మారింది. స‌మంత త‌న మాజీ భ‌ర్త నాగ చైత‌న్య‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ని డైవ‌ర్స్ అనౌన్స్‌మెంట్‌కి ముందు డిలీట్ చేసింది. దీంతో అందు వారిద్ద‌రు విడిపోతున్న‌ట్టు భావించారు. ఇక శ్రీజ‌- క‌ళ్యాణ్ దేవ్‌, నిహారిక‌- చైత‌న్య కూడా ఇదే రూట్‌లో వెళ్లారు. ఇప్పుడు అందాల భామ ఆసిన్ టైం వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో త‌న భ‌ర్త ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వీరిద్ద‌రు విడిపోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.
husband
ఆసిన్.. అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కి ర‌వితేజ‌-పూరీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అమ్మా నాన్న త‌మిళ అమ్మాయి, ఘ‌ర్ష‌ణ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. టాలీవుడ్ లో ఎక్కువ హిట్లు కొట్టిన హీరోయిన్ గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న ఆసిన్  కెరీర్ పీక్స్ లో ఉండగానే 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాల‌కి దూరంగా ఉంటూ వస్తుంది. ఆసిన్ భర్త రాహుల్ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓగా పని చేస్తున్నారు . అక్ష‌య్ కుమార్ సాయంతో వీరిద్దరి పెండ్లి జ‌రిగింద‌నే టాక్ కూడా ఉంది. అయితే కొంత కాలంగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది.

రాహుల్ శర్మ గ‌త కొన్నాళ్లుగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్న నేప‌థ్యంలో ఆసిన్ ప‌లుమార్లు హెచ్చ‌రించింద‌ట.అయినా  కూడా అతను ఎవ‌రి మాట‌ వినకుండా తనకు నచ్చినట్టు చేస్తుండటంతో..అత‌ని నుండి విడిపోవాల‌ని డిసైడ్ అయింద‌ట‌. ఓ పాప ఉన్నా కూడా అత‌ని ప‌ద్ద‌తి న‌చ్చ‌క విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఆసిన్ విడాకులకి సంబంధించిన న్యూస్  బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఆసిన్ ఈ వార్త‌ల‌పై ఏమైన స్పందిస్తుందో లేదో చూడాలి. కాగా ఆసిన్‌కి పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  అన్నవరం, ప్రభాస్ తో చక్రం వంటి పెద్ద సినిమాలు ఫ్లాపులు గా నిలిచాయి. అయినప్ప‌టికీ  ఈ సినిమాలు ఆసిన్ కెరీర్ కు మాత్రం బాగా ఉపయోగపడ్డాయి.  .

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...