Home Film News Tamannaah: అభిమాని ప్రేమకి క‌న్నీళ్లు పెట్టుకున్న త‌మ‌న్నా.. వైర‌ల్ అవుతున్న వీడియో
Film News

Tamannaah: అభిమాని ప్రేమకి క‌న్నీళ్లు పెట్టుకున్న త‌మ‌న్నా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్స్ లో ఒక‌రిగా ఉంది. ఒక‌ప్పుడు త‌మ‌న్నాకి వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌చ్చేవి. కాని ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. త‌మ‌న్నాకి వెబ్ సిరీస్ అవ‌కాశాలే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. తెలుగులో సినిమాలు కూడా త‌గ్గించింది. ఇక అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తూ త‌మ‌న్నా అంద‌రి అటెన్ష‌న్ త‌న‌వైపుకి తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇటీవ‌ల త‌మ‌న్నా త‌న ప్రేమాయ‌ణంతో వార్త‌ల‌లోకి ఎక్కింది. విజయ్ వ‌ర్మ అనే బాలీవుడ్ న‌టుడిని తాను ప్రేమిస్తున్నాన‌ని ఇద్ద‌రం డేటింగ్‌లో ఉన్నామ‌ని కూడా చెప్పుకొచ్చింది.
T
తాజాగా త‌మ‌న్నా  ఓ వీరాభిమాని చేసిన పనికి  కన్నీళ్లు పెట్టుకుంది. రీసెంట్‌గా ముంబై విమానాశ్ర‌యంలో త‌మ‌న్నా అడుగుపెట్ట‌గా, ఆమెని చూడ‌డానికి ఫొటోలు దిగ‌డానికి పెద్ద ఎత్తున అభిమానులు అక్క‌డికి చేరుకున్నారు. అయితే వారంద‌రిని కూడా త‌మ‌న్నా ప్రేమ‌గా ప‌ల‌క‌రించింది. అయితే అభిమానుల‌లో ఒక అభిమాని  తమన్నా పాదాలను తాకి.. దండం పెట్టాడు.  అంతేకాదు తర్వాత ఒక బొకే, లేఖను తన అభిమాన హీరోయిన్‌కు ఇచ్చాడు. అదే  సమయంలో తన చేతిపై వేయించుకున్న పచ్చబొట్టు  కూడా చూపించాడు. ఒక్క‌సారి అది చూసిన తమన్నా  ఎంతో ఎమోష‌న‌ల్‌కి గురైంది. త‌న చేతిపై తమన్నా ఫొటోతోపాటు ‘లవ్ యు తమన్నా’ అని పచ్చబొట్టు పొడిపించుకోవ‌డంతో క‌న్నీళ్లు కూడా పెట్టుకుంది.

త‌న అభిమాని త‌న‌పై చూపించిన ప్రేమ‌కి త‌మ‌న్నా  ఆ అభిమానిని కౌగిలించుకుని ‘ధన్యవాదాలు’ చెప్పింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక త‌మ‌న్నా త‌న ఇన్నేళ్ల కెరీర్‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. మిల్కీ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తుంది. రీసెంట్‌గా  లస్ట్ స్టోరీస్ 2  అంటూ ఓ వెబ్ సిరీస్  చేయ‌గా, ఇందులో  తన లవర్ విజయ్ వర్మతో క‌లిసి బోల్డ్‌గా న‌టించింది. ముద్దులు, హ‌గ్గులు మాములు ర‌చ్చ చేయ‌లేదు. ప్ర‌మోష‌న్స్ లో సైతం తెగ అందాలు ఆర‌బోస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది త‌మ‌న్నా.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...