Home Film News NTR Fan: ఎన్టీఆర్ అభిమాని మృతిపై స్పందించిన యువ హీరో.. ఆయ‌న ఏమ‌న్నారంటే..!
Film News

NTR Fan: ఎన్టీఆర్ అభిమాని మృతిపై స్పందించిన యువ హీరో.. ఆయ‌న ఏమ‌న్నారంటే..!

NTR Fan: ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. శ్యామ్ మరణం ఆత్మహత్య అని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దానిపై అనేక అనుమాలు వ్య‌క్తం చేశారు.శ్యామ్‌కి ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్‌… జూన్‌ 25న శనివారం అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్‌ తో పలుమార్లు కోసుకుని… అనంత‌రం ఉరివేసుకున్న స్థితిలో శ్యామ్‌ మృతదేహం కనిపించ‌డంతో ఈ మృతిపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా నమోదుచేసి  ద‌ర్యాప్తు చేసి విచారించారు. అయితే ఇందులో ఎలాంటి రాజ‌కీయ కోణం లేద‌ని, ప్రేమ వ్య‌వ‌హారం, చ‌దువుల్లో వెన‌క‌బాటుత‌నం వ‌ల్ల‌నే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని చెప్పుకొచ్చారు.

శ్యామ్ మృతిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. స్తూ… ‘శ్యామ్ మరణం  చాలా బాధాక‌రం. ఆయ‌న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను  అంటూ జూనియర్ ఎన్టీఆర్  త‌న లేఖలో పేర్కొన్నారు. ఇక యువ హీరో నాగ శౌర్య కూడా శ్యామ్ మృతిపై స్పందించారు. నాగ శౌర్య న‌టించిన ‘రంగబలి’ మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఆయ‌న మాట్లాడుతూ..జీవితంలో ఏమి  సాధించలేకపోతున్నానని అలా సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు అని నాగ‌శౌర్య అన్నారు.

ఇక‌ ఇటీవల ఒక అబ్బాయి రోడ్డు మీద ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే.. మధ్యలో నాగశౌర్య కలుగజేసుకున్న విష‌యంపై కూడా ఆయ‌న స్పందించారు. నేను ఎవ‌రిని కొట్ట‌లేదు. అబ్బాయిని ఎందుకు కొడుతున్నావ‌ని అడిగాను, అప్పుడు ఆ అమ్మాయి స‌మాధానం విని షాక్ అయ్యాను. అత‌ను నా బాయ్ ఫ్రెండ్ కొడితే కొడ‌తాడు, లేదంటే చంపుతాడు అని ఆ అమ్మాయి చెప్పింద‌న్నారు నాగ శౌర్య‌. పెళ్లి చేసుకునే అమ్మాయిల‌కి నేను ఇచ్చే స‌ల‌హా ఒక్క‌టే.. కొట్టే అబ్బాయిల‌ని ఏ మాత్రం పెళ్లి చేసుకోకండి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Related Articles

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...