Home Film News Farm House: ఈ హీరో త‌న ఫామ్ హౌజ్‌ని పెళ్లిళ్లకి, ఫంక్ష‌న్స్‌కి రెంట్ ఇస్తున్నాడా.. బిజినెస్ బాగుందే..!
Film News

Farm House: ఈ హీరో త‌న ఫామ్ హౌజ్‌ని పెళ్లిళ్లకి, ఫంక్ష‌న్స్‌కి రెంట్ ఇస్తున్నాడా.. బిజినెస్ బాగుందే..!

Farm House: ఈ రోజుల్లో చాలా మంది హీరోలు కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా, యాడ్స్ ,ఇత‌ర బిజినెస్‌లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు వంటి వారు థియేట‌ర్స్ బిజినెస్ చేస్తూ మంచి లాభాలు రాబ‌డుతుండ‌గా, ఇప్పుడు క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర తన ఫామ్ హౌస్‌తో డ‌బ్బులు ఎందుకు సంపాదించ‌కూడ‌దు అని కొత్త‌గా ఆలోచన చేశాడ‌ట.త‌న ఫామ్ హౌజ్‌ని అందంగా ముస్తాబు చేసి పెళ్లిళ్లు, పుట్టిన‌రోజు వేడుక‌లు వంటి వాటికి అద్దెకి ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఉపేంద్ర‌కి  బెంగళూరులోని మైసూర్ రోడ్డులో పెద్ద మర్రి చెట్టు సమీపంలో  నాలుగు ఎకరాల అందమైన ఫాంహౌస్ ఉంది.

ఫామ్ హౌజ్‌లో విలాస‌వంత‌మైన భ‌వనం ఉండ‌గా, చుట్టూ ప‌చ్చ‌దనం క‌నిపిస్తుంది. ఇది చూపరుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ ఫాంహౌస్‌ను అద్దెకు ఇస్తున్నట్టు ఉపేంద్ర ఒక వీడియోను విడుదల చేసి.. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఎంగేజ్‌మెంట్స్, పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు లాంటి ప్రత్యేకమైన వేడుకలకు తన ఫాంహౌస్ మీకు ప‌క్కాగా స‌రిపోతుంద‌ని అన్నారు. ఈ ఫామ్ హౌజ్‌లో  బార్/లాంజ్ ఏరియా కూడా ఉందట‌. 6 విలాసవంతమైన పడక గదులు, 10వేల చదరపు అడుగుల టెర్రస్ ఏరియా ఉందట‌.

ఇక ఇందులో  వంటలు చేసుకోవడానికి, భోజనాలు చేయడానికి, రాత్రి పార్టీలు చేసుకోవడానికి భవంతి వెనకాల 10వేల చదరపు అడుగుల స్థలం ఉందని తెలుస్తుంది. ఇక ఈ స్థలంలో నాలుగు గదులు, వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫాంహౌస్‌కు చేరుకోవడానికి బెంగళూరు నుంచి ఒక గంట 20 నిమిషాల సమయం పడుతుంద‌ని,  ఈ ఫాంహౌస్‌ను బుక్ చేసుకోవడానికి 9686287070 నంబర్‌కు సంప్రదించాలని ఉపేంద్ర తెలియ‌జేశారు. కాగా, ఉపేంద్ర తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న న‌టించిన‌ కన్నడ డబ్బింగ్‌ సినిమాలు తెలుగులో మంచి విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు ఉపేంద్ర  కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటుతున్నాడు.  ప్రస్తుతం 2009లో రిలీజై హిట్‌గా నిలిచిన బుద్ధివంత (తెలుగులో బుద్ధిమంతుడు) మూవీకి సీక్వెల్ చేస్తుండగా, ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...