Home Film News Megastar: ఓ వైపు కుటుంబంలో స‌మ‌స్య‌లు.. ఎంచ‌క్కా భార్య‌తో ట్రిప్ వేసిన మెగాస్టార్
Film News

Megastar: ఓ వైపు కుటుంబంలో స‌మ‌స్య‌లు.. ఎంచ‌క్కా భార్య‌తో ట్రిప్ వేసిన మెగాస్టార్

Megastar: ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ పేరు తెలుగు రాష్ట్రాల‌లో మారు మ్రోగిపోతుంది. అందుకు కార‌ణం నిహారిక విడాకులు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడాకులు, శ్రీజ విడాకుల విష‌యంలో మెగా ఫ్యామిలీని తీవ్రంగా విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నిహారిక తాను తన భ‌ర్త నుండి విడిపోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది.  ఈ విష‌యం విన‌గానే చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. నిహారిక.. జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీలో కలవలేకపోవ‌డం వ‌ల్ల‌నే విడాకులు తీసుకుంద‌ని అనుకుంటున్నారు. సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీలో పెరిగిన నిహారిక‌.. ప్రతినిత్యం   పార్టీలు, పబ్బులు, వెకేషన్ అంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది జొన్న‌ల‌గ‌డ్డ ఫ్యామిలీకి న‌చ్చ‌క‌పోవ‌డంతోనే విడాకులు ఇచ్చి ఉంటార‌నే వాద‌న వినిపిస్తుంది.

ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త‌న మొద‌టి భ‌ర్త‌కి విడాకులు ఇచ్చి క‌ళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా అత‌నితో దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా, అత‌నికి కూడా శ్రీజ విడాకులు ఇచ్చింద‌ని టాక్. మ‌రి కొద్ది రోజులలో ఈమె కూడా త‌న విడాకుల‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడో పెళ్లి కూడా పెటాకులు అయిందని, మూడో భార్య త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ర‌ష్యా వెళ్లిపోయింద‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. అయితే దీనిపై స్పందించిన జ‌న‌సేన పార్టీ ప‌వన్, అన్నా క‌లిసి ఉన్న పిక్ షేర్ చేసింది. ఇది ఇప్ప‌టి పిక్ కాద‌ని, ఎడిట్ చేసార‌ని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ విడాకుల వ్య‌వ‌హారాలు మెగా ఫ్యామిలీపై తీవ్ర‌మైన నెగెటివిటీని పెంచుతున్నాయి. చిరంజీవి కూడా ఈ విష‌యంలో చాలా అప్సెట్‌గా ఉన్న‌ట్టు తెలుస్తుంది. అందుకే మ‌న‌శ్శాంతి కోసం ఫారెన్ ట్రిప్ వేసాడ‌ని  చెప్పుకొస్తున్నారు. ద‌ర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కానుండ‌గా, రీసెంట్‌గా ఈ మూవీ డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా పూర్తి చేశారు చిరు. ఈ క్ర‌మంలో త‌ను,త‌న వైఫ్ తో క‌లిసి స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళుతున్నారు.ఇక త‌న ట్రిప్  గురించి చిరంజీవి సోషల్ మీడియాలో తెలియజేశాస్తూ.. పిక్ కూడా షేర్ చేశారు. ఈ  ట్రిప్ ముగించుకుని వచ్చాక కూతురు సుస్మిత బ్యానర్ లో మూవీ చేయ‌నున్నాడ‌ని, ఈ చిత్రం బింబిసార డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేయ‌నున్నాడని టాక్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...