Home Film News Krithi Setty: కృతి శెట్టిని స్టార్ హీరో కొడుకు వేధించిన‌ట్టు ప్ర‌చారం.. స్పందించిన బేబ‌మ్మ‌
Film News

Krithi Setty: కృతి శెట్టిని స్టార్ హీరో కొడుకు వేధించిన‌ట్టు ప్ర‌చారం.. స్పందించిన బేబ‌మ్మ‌

Krithi Setty: ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి. తొలి సినిమాలోనే త‌న అందం, అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది బేబ‌మ్మ‌. తొలి సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో కృతి శెట్టికి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. కృతి శెట్టి ఉప్పెన త‌ర్వాత  ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది కృతి శెట్టి. అయితే కొన్నాళ్లుగా కృతి శెట్టికి స‌రైన స‌క్సెస్‌లు రావ‌డం లేదు. మంచి హిట్ కోసం ప‌రిత‌పిస్తుంది. గ‌తంలో క‌న్నా కొంత అందాలు కూడా ఆర‌బోస్తుంది. అయితే కెరీర్ ఎలా ముందుకు ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్న స‌మ‌యంలో కృతికి సంబంధించిన ఓ సంచ‌ల‌న వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది.

స్టార్ హీరో కొడుకు కృతి శెట్టిని   స్నేహం చేయమని విసిగించేవాడని, అతడు వెళ్లిన ప్రతీ కార్యక్రమానికి నటిని రమ్మనే వాడంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. షూటింగ్ మానేసి త‌న బ‌ర్త్ డే పార్టీకి వ‌స్తే కోట్ల రూపాయ‌లు కూడా ఇస్తాన‌ని చెప్పాడ‌ని కొంద‌రు రాసుకొచ్చారు. అయితే ఈ వార్త‌లు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న నేప‌థ్యంలో కృతి శెట్టి స్పందించింది.  అస‌లు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దయచేసి ఇలాంటి  తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపండి అంటూ త‌న ట్విట్టర్ లో పేర్కొంది కృతి శెట్టి. ‘ ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానండి.  అస‌లు ఇవి పూర్తి నిరాధారమైన వార్త‌లు కాబట్టి దాన్ని పట్టించుకోకూడదని మొదట నేను అనుకున్నా. కానీ ఈ ప్రచారం మరింతగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో స్పందించక తప్పడం లేదు. దయచేసి ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం ఆపాలంటూ   కృతి పేర్కొంది.

కృతి శెట్టి ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ  సినిమాలతో బిజీగా ఉంది. అలానే మ‌ల‌యాళంలో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ తో అల‌రించేందుకు రెడీ అవుతుంది.  టివోనో థామస్ హీరోగా నటిస్తున్న ‘అజయ రాండం మోషణం’  సినిమాలో క‌థానాయిక‌గా నటిస్తోంది కృతి. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.  ఈ సినిమాతో పాటు తమిళంలో జయం రవి  హీరోగా నటిస్తున్న ‘జీని’ సినిమాలోనూ క‌థానాయిక‌గా ఎంపికైంది కృతి శెట్టి.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...