Home Special Looks చెవిటి, మూగ అయినా అందం ‘అభినయం’ ఆమెని ఆపలేదు..
Special Looks

చెవిటి, మూగ అయినా అందం ‘అభినయం’ ఆమెని ఆపలేదు..

The Popular Actress Who Is Hearing and Speech Impaired

ఆమెకి చెవులు వినిపించవు. మాట్లాడటం కూడా రాదు. కానీ, తెలుగు తమిళ రెండు భాషల్లోనూ చాలా సినిమాలు చేసింది. అవార్డులు కూడా గెలుచుకుంది. తనకి తోడైన అందంతో ఎంతో చక్కగా నటించే ఒక నటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆమె పేరు అభినయ. చిన్నప్పటినుంచే చెవులు వినిపించవు. నోరు తెరిచి మాట్లాడలేదు. చాలా చిన్న వయసులోనే ఆమెకి సినిమా పరిచయం అయింది. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమెకి సినిమాల మీద ఎంతో ఇష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది.

తన పేరుకి తగ్గట్టే ఎంతో అందంగా నటించడం అలవాటు చేసుకున్న ఆమె రాజమండ్రికి చెందిన వ్యక్తి. ఆమె తండ్రిని కూడా మనం సినీ తెర మీద చాలాసార్లే చూసి ఉంటాం. ఐతే చెన్నైలో పుట్టి పెరగడం వల్ల చాలావరకు తమిళ అమ్మాయిగానే అనిపిస్తుంది అభినయ. కానీ, ఆమె ఇంట్లో తెలుగే మాట్లాడతారు. అందుకే ఇటు తెలుగులోనూ చక్కగా సినిమాలు చేయగలుగుతుంది. కానీ మొదట్లో అస్సలు సినిమా అవకాశాలు దొరికేవి కాదట. అందుకు కారణం తనకి మాట్లాడటం రాకపోవడం. చెవులు కూడా వినపడకపోవడం వల్ల ఆమెకి సీన్లని చెప్పాలంటే చాలా కష్ట సాధ్యంగా ఉండేది. అందుకే ఆమె తల్లిదండ్రులు తన సీన్ వచ్చినప్పుడు సైగల ద్వారా దాన్ని explain చేసే ప్రయత్నం చేసేవాళ్ళట.

సహజంగా ఆమెని సినిమాల్లో చూసిన వాళ్ళకి.. నిజజీవితంలో ఈమెకి మాటలు రావు అంటే నమ్మటం చాలా కష్టంగా అనిపిస్తుంది. స్క్రీన్ మీద ఎంతో చురుగ్గా, చలాకీగా కనిపించే ఆమెకి ఇలాంటి సమస్య ఉందని తెలిస్తే ఎవ్వరైనా అయ్యో అంటారు. కానీ, తన బలహీనతని ఎప్పుడూ నటనపై తనకి ఉన్న ఆసక్తిని తగ్గకుండా చూసుకుంది. మొదట్లో సినిమాల్లో అవకాశాలు రావటం లేదని, మాట్లాడే అవసరం లేని అనేక ప్రకటనల్లో ఆమెని నటింపజేశారు వాళ్ళ నాన్న. ఆమె బలహీనతలని దృష్టిలో పెట్టుకుని ఆమెని నిరుత్సాహ పడేలా చేయడం వంటివి కాకుండా.. తన వెంటే ఉంటూ ఆమె సంతోషం కోసం ప్రయత్నించిన ఆ తండ్రికి జోహార్లు చెప్పుకోవాలి.

2009 లో Nadodigal సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయం ఐన అభినయ అందులో చేసిన పాత్ర ద్వారా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ మరుసటి సంవత్సరం ఇదే సినిమాని తెలుగులో శంభో శివ శంబోగా తీశారు. ఇందులోనూ హీరో చెల్లెలిగా నటించి మరో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఆమె అందుకుంది. నిజానికి అభినయ 2008 లోనే తెలుగు తెరకు ‘నేనింతే’, ‘కింగ్’ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత దమ్ము, జీనియస్, ఢమరుకం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబుల చెల్లిగా నటించి అభిమానులని సొంతం చేసుకుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...