Home Film News Naga Chaitanya : ‘బాబు రెడీ బాబు’.. సూపర్ స్టైలిష్‌గా చై..
Film News

Naga Chaitanya : ‘బాబు రెడీ బాబు’.. సూపర్ స్టైలిష్‌గా చై..

Boyapati Sreenu
Boyapati Sreenu

Naga Chaitanya: ‘యువ సామ్రాట్’ నాగ చైతన్య జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒక దాని తర్వాత ఒకటి వరుస సినిమాలు లైనప్ చేస్తూనే.. ‘దూత’ అనే క్రేజీ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. జూలై 8న ‘థ్యాంక్యూ’, ఆగస్టు 11న బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ తో అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు చై.

చైతుని ఆమిర్ ఖాన్ హిందీ ఇండస్ట్రీకి తీసుకెళ్తే.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుని చైతు తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ మీద బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి లెజెండరీ మ్యూజిక్ ‘మ్యాస్ట్రో’, ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా, ఆయన తనయుడు ‘యంగ్ మ్యాస్ట్రో’ యువన్ శంకర్ రాజా ఇద్దరూ సంగీతమందిస్తుండడం విశేషం.

గురువారం పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నాగ చైతన్య, కృతి శెట్టిల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ నిచ్చారు.

హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తమిళ్ వెర్షన్‌కి ప్రముఖ దర్శకులు భారతీ రాజా క్లాప్ నివ్వగా, యంగ్ హీరో శివ కార్తికేయన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యువన్ శంకర్ రాజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో #NC22 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...