Home Uncategorized Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!
Uncategorized

Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!

Vikrant Rona Trailer
Vikrant Rona Trailer

Vikrant Rona Trailer: పాపులర్ కన్నడ స్టార్, ‘బాద్‌షా’, ‘కిచ్చా’ సుదీప్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ్, తెలుగులో నటించిన సుదీప్ ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నాడు.

దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విక్రాంత్ రోణ’ లో శ్రీలంక సోయగం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణ’ తెలుగు ట్రైలర్ ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ విడుదల చేసి, మూవీ టీంకి విషెస్ తెలియజేశారు.

ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.. క్లుప్తంగా కథ చెప్తూనే.. ‘విక్రాంత్ రోణ’ విజువల్ వండర్‌గా ఉండబోతుందని చూపించారు. విజువల్స్, లైటింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని భయంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసేట్టుగా ఉన్నాయి. మిగతా భాషల్లోనూ ట్రైలర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వస్తోంది. జూలై 28న త్రీడీలో ‘విక్రాంత్ రోణ’ భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..

God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్...

Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్...

Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..

Kamal Hassan: కాస్త టైం గ్యాప్ అంతే.. కొడితే మాత్రం తిరుగుండదు అన్నట్లు యూనివర్సల్ స్టార్...

మెగా పవర్ స్టార్ మీద మనసు పడ్డ మిస్ వరల్డ్..

ట్రిపులార్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత తన 15వ...