Home Film News 2024 Summer War: 2024 సమ్మ‌ర్ వార్.. ఆ న‌లుగురు హీరోలు బ‌రిలో దిగితే ఇంకేమ‌న్నా ఉందా?
Film News

2024 Summer War: 2024 సమ్మ‌ర్ వార్.. ఆ న‌లుగురు హీరోలు బ‌రిలో దిగితే ఇంకేమ‌న్నా ఉందా?

2024 Summer War: సమ్మ‌ర్‌లో పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల కావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వేస‌వి సెల‌వ‌ల స‌మ‌యంలో టాప్ హీరోలు త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. 2023 సమ్మర్  ప్రేక్ష‌కుల‌కి అంత కిక్ ఇవ్వ‌లేదు.దీంతో వ‌చ్చే సమ్మ‌ర్ కోసం అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. పెద్ద హీరోలు సినిమాలు విడుదల కానున్నాయ‌ని, అవి ప్రేక్ష‌కుల‌కి ఫుల్ వినోదం అందించ‌నుంద‌ని భావిస్తున్నారు. 2024 సమ్మర్ కి అగ్ర హీరోలంతా క్యూలో కనిపిస్తుండ‌డంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగానే ఉండ‌నున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఈ పోటీలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న‌ ‘దేవర చిత్ర షూటింగ్ ని నవంబర్ లోగా పూర్తిచేసి ప్రకటించిన ఏప్రిల్ 5వతేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర షూటింగ్ వేగం కూడా పెంచిన‌ట్టు తెలుస్తుంది. ఇక పుష్ప‌తో భారీ హిట్ కొట్టిన సుకుమార్- బ‌న్నీ  పుష్ప-2  చిత్రాన్ని సమ్మర్ బరిలోనే దింపే అవకాశం ఉంది. సంక్రాంతి రిలీజ్ అనుకుంటున్నారు గానీ అది వీలుప‌డే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు.  ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కూడా సమ్మర్ కే ఫిక్సై అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్ కి చేరిన‌ట్టు తెలుస్తుంది.జూలై నుండి మూవీ చిత్రీక‌ర‌ణ వేగం పెంచ‌నున్నారు. ఈ మూవీ  రిలీజ్ కూడా వేసవి అయితే అనుకూలంగా ఉంటుందని మేకర్స్ అనుకుంటున్నార‌ట‌.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త‌న 28వ చిత్రంగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఇదే ఏడాది సినిమాని వారు రిలీజ్ చేయాల‌ని ముందు అనుకున్నా ఇప్పుడు ప్లాన్ మారిన‌ట్టు తెలుస్తుంది. మూవీ చిత్రీక‌ర‌ణ‌కి మ‌రో   ఆరునెలలు సమయం పడుతుంది కాబ‌ట్టి, ఆ త‌ర్వాత  పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవ్వడానికి రెండు నెలలు తప్పనిసరి అవ‌స‌రం. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రం కూడా  వేసవిలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ స‌మ్మ‌ర్ మంచి రంజుగా ఉండ‌నుండ‌డం ఖాయం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...