Home Film News Director: బాబోయ్.. ఆ ద‌ర్శ‌కుడు హీరోల‌పై కూడా చేయి చేసుకుంటాడా..!
Film News

Director: బాబోయ్.. ఆ ద‌ర్శ‌కుడు హీరోల‌పై కూడా చేయి చేసుకుంటాడా..!

Director: కొంద‌రు ద‌ర్శ‌కులు సినిమాని ప్రాణంగా ప్రేమిస్తారు. తాము కావాల‌నుకున్న ఔట్‌పుట్ వ‌చ్చేంత వ‌ర‌కు క‌ష్ట‌ప‌డుతూనే ఉంటారు. ఈ క్ర‌మంలో త‌న అసిస్టెంట్స్‌, న‌టుల‌పై కూడా చేయి చేసుకుంటారు. ద‌ర్శ‌కులు న‌టీన‌టుల‌పై చేయి చేసుకోవ‌డం వంటి విష‌యాలు మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కూడా విన్నాం. ద‌ర్శ‌కుడు తేజ్.. ఉదయ్ కిర‌ణ్ లాంటి వారితో కూడా నట‌న రాబ‌ట్టేందుకు చేయి చేసుకున్నాడ‌ని అప్ప‌ట్లో ప్రచారం జ‌రిగింది.  అయితే తేజ అంటే న‌టీన‌టులకి హ‌డ‌ల్. త‌మిళంలోను అలాంటి ద‌ర్శ‌కుడు ఒక‌రు ఉన్నారు. అతని పేరు మారీ సెల్వ‌రాజ్. ఇటీవ‌ల ధనుష్‌తో కర్ణన్ అనే సినిమా తీసి సూపర్‌ హిట్‌ అందుకున్న అత‌ను ఇప్పుడు ఉదయనిధి, ఫాహద్‌ ఫాజిల్‌తో మామన్నన్‌ సినిమా చేశారు. ఈ చిత్రం జూన్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.

మారీ సెల్వ‌రాజ్ త‌న‌కి కోపం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చిత్రంలో ప‌ని చేసే నటులు, అసిస్టెంట్‌ డైరెక్టర్లపై చెయ్యి చేసుకుంటారని చాలా సార్లు వార్త‌లు వచ్చాయి. మారీకి కోపం వ‌స్తే సెట్ అంతా భీబ‌త్సంగా మారుతుంద‌ని, ఆయ‌న త‌న అసిస్టెంట్స్ పై కూడా దాడి చేస్తాడ‌ని కొంద‌రు చెప్పుకొచ్చారు. అయితే ఇదే విష‌యాన్ని తాజాగా  ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో చెపుకొచ్చారు. మారీకి కోపం వస్తే అసిస్టెంట్లను చావగొడతాన్న‌ది నిజం అని ఉదయనిధి అన్నారు.  మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో  చాలా టెన్షన్‌ పడ్డది డైరెక్టర్‌ సారే.

మారీ సార్ అందర్నీ కొట్టేవాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్లందర్నీకూడా  కొట్టేవాడు. అతను కొడుతుంటే వాళ్లు గట్టిగట్టిగా అరిచే వాళ్లు.  అసిస్టెంట్స్ ఒక‌వైపు,  కెమెరా మ్యాన్‌ మరోవైపు ఆయ‌న దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేక అరిచేవాళ్లు అని ఉద‌య‌నిథి స్టాలిన్ చెప్పుకొచ్చాడు. మ‌రో వీడియోలో   మారీ సెల్వరాజ్‌ నన్ను కూడా కొట్టారు.ఓ సీన్‌లో కాఫీ తాగిన‌ట్టు న‌టించ‌మ‌ని చెప్పారు. అది చేయ‌లేకపోయా. హీరో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు డైలాగ్ చెప్ప‌మ‌న్నారు. అది మ‌రచిపోయా. అప్పుడు నా చెంప మీద కొట్టారు మారీ సెల్వరాజ్. అప్పుడు ఏడ్చుకుంటూ నేను చేయ‌న‌ని చెప్పాను. అప్పుడు బ్ర‌తిమిలాడి న‌న్ను న‌టించేలా చేశారు. మొత్తానికి ద‌ర్శ‌కుడికి సంబంధించిన ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...