Home Film News Lavanya: లావ‌ణ్య త్రిపాఠి త‌న ఫోన్ వాల్ పేప‌ర్ ఎవ‌రి ఫొటో పెట్టుకుందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Film News

Lavanya: లావ‌ణ్య త్రిపాఠి త‌న ఫోన్ వాల్ పేప‌ర్ ఎవ‌రి ఫొటో పెట్టుకుందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Lavanya: అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి కొన్నాళ్లుగా వ‌రుణ్ తేజ్ తో సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డిపింది. వ‌రుణ్‌తో లావ‌ణ్య రిలేష‌న్ లో ఉంద‌ని గ‌తంలో ఎన్నో వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు కొట్టి పారేసింది. అయితే ఎట్ట‌కేల‌కు జూన్ 9న  నాగబాబు నివాసంలో మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం, లావణ్య కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరిద్ద‌రు ఎంగేజ్‌మెంట్  జ‌రుపుకొని అంద‌రికి షాక్ ఇచ్చారు.  ఇక ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన త‌ర్వాత  లావణ్య తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను వరుణ్ షేర్ చేయ‌గా,ఈ పిక్ నెట్టింట తెగ వైర‌ల్ అయింది. ఇక వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.

మొన్నటివరకు వీరిద్దరు ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచ‌న‌లు మారాయి. డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హాలో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. వారిద్దరూ ఇప్పటికే కొన్ని దేశాలు, అందులో రిసార్టుల్ని కూడా సెల‌క్ట్ చేసుకున్నార‌ని, ఒక‌టి ఫైన‌ల్ చేయాల‌ని చూస్తున్నార‌ని టాక్. వీరిరివురు 3 రోజుల పాటు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. టోటల్ మెగా కాంపౌండ్ సభ్యులంతా ఈ పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు.  ఇక హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్ర‌త్యేక‌ రిసెప్షన్ ఏర్పాటు చేస్తార‌ని టాక్ న‌డుస్తుంది.

వ‌రుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించిన అనేక విష‌యాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఈ అమ్మ‌డు  తన ఫోన్ వాల్ పిక్ ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, ఇది నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇందులో  కుటుంబ సభ్యులు, స్నేహితులతో పలు ప్రత్యేక సందర్భాల్లో దిగిన పలు ఫొటోల‌తో పాటు వ‌రుణ్ తేజ్ తో దిగిన పిక్ కూడా ఉంది. ఇక ఈ పిక్ కి  ‘మై లవ్స్.. డ్రీమ్ బిగ్గర్’ అంటూ క్యాప్షన్ జోడించింది లావ‌ణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక వరుణ్‌ తేజ్ ..స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. అలానే  డెబ్యూ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్ద‌రితోనే కాకుండా పలాస ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఒక చిత్రం చేయ‌నున్నాడు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...