Home Film News Taapsee Pannu: తాప్సీ కూడా గ‌ర్భ‌వ‌తి అయ్యాకే పెళ్లి చేసుకుంటుందా.. ఆమె మాట‌ల‌లో అర్ధ‌మేంటి?
Film News

Taapsee Pannu: తాప్సీ కూడా గ‌ర్భ‌వ‌తి అయ్యాకే పెళ్లి చేసుకుంటుందా.. ఆమె మాట‌ల‌లో అర్ధ‌మేంటి?

Taapsee Pannu: ఇటీవ‌ల చాలా మంది ముద్దుగుమ్మ‌లు పెళ్లికి ముందే ప్ర‌గ్రెంట్ అవుతున్నారు. సైలెంట్‌గా డేటింగ్ చేయ‌డం, కొద్ది రోజుల‌కి ప్ర‌గ్నెంట్ కావ‌డం, హ‌డావిడిగా పెళ్లి చేసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. ఇలియానా, అలియా భట్, నేహా ధూపియా లాంటి వారంద‌రు కూడా పెళ్ళికి ముందే గర్భం దాల్చి షాకిచ్చారు. అలియా భట్ రణబీర్ ని.. నేహా ధూపియా అంగద్ బేడీని తాము ప్ర‌గ్నెంట్ అని తెలియ‌గానే వివాహం చేసుకోగా, ఇలియానా మాత్రం మ్యారేజ్ విషయంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓపెన్ కాలేదు. అయితే పెళ్లికి ముందే గ‌ర్భం దాల్చే వారికి గట్టిగా చుర‌క‌లు అంటించింది తాప్సీ.

పెళ్ళికి ముందే గర్భం.. అది తెలియగానే వెంటనే పెళ్లి అనే ట్రెండ్ ఉందన్న‌ట్టు తాప్సీ మాట్లాడి తోటి హీరోయిన్స్‌కి గ‌ట్టి పంచ్‌లు ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న తాప్సీ.. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఆన్‌లైన్‌లోకి రాగా, పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తాప్సి ఎవ‌రు ఊహించని విధంగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ‘నేనింకా గర్భవతిని కాలేదు.. కాబట్టి నా పెళ్లి అంత తొందరగా ఉండకపోవచ్చు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి గురించి అడిగితే పెళ్ళికి ముందే గర్భం అంటూ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్ చేసింది తాప్సీ.

 

బాలీవుడ్ హీరోయిన్స్ ని ఉద్దేశించే తాప్సీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసింద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇక తాప్సీ విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు కూడా ప్ర‌స్తుతం ప్రేమ‌లో ఉంది. బ్యాట్మింటన్ ఆటగాడు మ్యాతీస్ బోతో డేటింగ్ చేస్తుండ‌గా, పలు సందర్భాల్లోవీరిద్దరు జంటగా కనిపించారు.త్వ‌ర‌లో నే పెళ్లి చేసుకుంటుదని అనుకుంటుండ‌గా, ఊహించ‌ని కామంట్ చేసి అంద‌రికి పెద్ద షాకిచ్చింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ సొట్టబుగ్గల సుందరి షారుఖ్ ఖాన్ డుంకి చిత్రంలో నటిస్తోంది. ఇటీవ‌ల తాప్సీ ఎక్కువ‌గా హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...