Home Film News Rajiv Reaction: భ‌ర్త కోసం ఉత్సాహంగా ఉరుక్కుంంటూ వ‌చ్చిన సుమ‌.. రాజీవ్ రియాక్ష‌న్ చూసి షాక్..!
Film News

Rajiv Reaction: భ‌ర్త కోసం ఉత్సాహంగా ఉరుక్కుంంటూ వ‌చ్చిన సుమ‌.. రాజీవ్ రియాక్ష‌న్ చూసి షాక్..!

Rajiv Reaction: యాంకర్ సుమ‌..తెలుగు రాష్ట్రాల‌లో ఈమె పేరు తెలియ‌ని వారు లేరు. బుల్లితెరపై ఆమె మెగాస్టార్ అని చెప్పవచ్చు. ఎంతటి పెద్ద షో అయిన కూడా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటుంది.మ‌ల‌యాళీ అయిన సుమ తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడుతుంది. సుమ యాంకరింగ్ చేస్తే ఆ షో హిట్ అనే అభిప్రాయంలో ఉంటారు. త‌న‌దైన చలాకైన మాటలతో గత 16 సంవత్సరాలుగా అలరిస్తున్న సుమ ఇటీవ‌ల వెకేషన్‌కి వెళ్లింది. అక్క‌డ తెగ తిరిగేయ‌డంతో త‌న కాలికి గాయం అయింద‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. సుమ కాలాన్ని బట్టి మారింది. ఒక‌వైపు బుల్లితెర‌పై సందడి చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా సుమ త‌న భ‌ర్త‌తో క‌లిసి చేసిన వీడియో నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది.

వెకేష‌న్‌కి వెళ్లిన సుమ‌ చాలా రోజుల తర్వాత త‌న భ‌ర్త‌తో స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని ఇంటికి వ‌చ్చింది. ఇంటి ద‌గ్గ‌ర కారు దిగ‌డంతో ఆమెలో ఎక్క‌డ లేని ఎన‌ర్జీ వ‌చ్చింది. త‌న భ‌ర్త‌ని క‌లుస్తున్నాను అనే ఆనందం ఆమె ముఖంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. త‌న లగేజ్‌తో స్పీడ్‌గా ఉరుక్కుంటూ వ‌స్తుంది మ‌రోవైపు రాజీవ్ క‌న‌కాల ఏదో అలికిడి వినిపించి త‌న చేతిలో ఉన్న పేప‌ర్ల‌ని పైకి ఎగ‌రేసి  బ‌య‌టకు వ‌చ్చి డోర్ తీస్తాడు.  ఎదురుగా సుమ కనకాల కనిపించడంతో రాజీవ్ కనకాల మొహం ఒక్కసారిగా మాడిపోతుంది. ” అప్పుడే ఎందుకు వచ్చావు? ఇంకో 20 లేదా 25 రోజులు ఉండిరావొచ్చు కదా?” అని రాజీవ్ అన‌డంతో సుమ షాక్‌లో ఉంటుంది.

సుమ ల‌గేజ్‌తో లోప‌లికి వెళ్ల‌డం, స‌రే లోప‌లికి రా అంటూ రాజీవ్ క‌న‌కాల అన‌డంతో వీడియో ముగుస్తుంది. భార్య ఎక్స్‌పెక్టేష‌న్స్ , భర్త రియాక్ష‌న్స్ అనే క్యాప్ష‌న్‌తో సుమ ఈ వీడియో షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దీనిపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్న‌ నెటిజన్లు ఆస‌క్తిక‌ర కామెంట్స్  చేస్తున్నారు. ” అయ్యో సుమక్కా నువ్వు రావడం రాజీవ్ బావ‌కి ఏ మాత్రం ఇష్టం లేదు అనుకుంటా అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా, మ‌రి కొంద‌రు వివిధ ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైన సుమ‌, రాజీవ్ క‌న‌కాల వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...