Home Film News Controversial Movies: వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచిన సినిమాలేవో మీకు తెలుసా?
Film News

Controversial Movies: వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచిన సినిమాలేవో మీకు తెలుసా?

Controversial Movies: సినీ ఇండస్ట్రీ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు కొత్తగా ఏదైనా సినిమా చేస్తున్నారంటే కాంట్రవర్సీలు ఎక్కడో చోట.. ఏదోక రకంగా వస్తునే ఉంటాయి.. సినిమా టైటిల్స్ దగ్గర్నుండి ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్, క్యారెక్టర్స్ ఇలా ఏదొక విషయంలో వివాదాలు వస్తాయి. అలా మని టాలీవుడ్ లో కాంట్రవర్సీలకు గురైన సినిమాలు ఏవో ఇప్పుడొక లుక్కేద్దాం. ఫస్ట్ అయితే సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెరకెక్కించడంతో డబ్బుల విషయంలో నరసింహారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ గొడవ చేశారు. ఆ తర్వాత కాంప్రమైజ్ చేసి మూవీని రిలీజ్ చేయించారు. సర్కార్ వారి పాట మూవీ సెకండాఫ్ లో కీర్తిసురేష్ తో మహేష్ బాబు బ్లాక్ మెయిల్ చేయడం లాంటి సీన్స్ విషయంలో కాంట్రవర్సీలు వచ్చాయి. నెక్ట్స్ రంగస్థలంలో రంగమ్మ రంగమ్మ అనే సాంగ్ లో గొల్లభామ వచ్చి గోళ్లు గిల్లుతుంటే అనే లిరిక్ కి తమ జాతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని యాదవుల సంఘం వారు ఆరోపించారు. ఆ పదం రిమూవ్ చేసి సినిమాను రిలీజ్ చేశారు.. నెక్ట్స్ రామ్ గోపాల్ వర్మ మూవీ మర్డర్. పరువు హత్య గురించి తీసిన ఈ సినిమాపై వివాదాలు వచ్చాయి. తెలంగాణలో కలకలం రేపిన పరువు హత్య ప్రణయ్ తండ్రి కోర్టులో కేసు వేయగా.. ఈ మూవీని రామ్ గోపాల్ వర్మ ఆర్జీ వరల్డ్ లో రిలీజ్ చేశారు.

నెక్ట్స్ రవితేజ నటించిన దరువు సినిమా టైటిల్ ను తెలంగాణ సంఘం వ్యతిరేకించింది. తర్వాత రామ్ చరణ్ నటించిన రచ్చ మూవీలో వాన వాన వెల్లువాయే అనే సాంగ్ ను గౌతమ్ బుద్ధుని విగ్రహం ముందు తీశారని మహిళా సంఘాలు వివాదం రేపాయి. నెక్ట్స్ మాస్ డైరెక్టర్ హరి శంకర్ డైరెక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం మూవీలో చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గాయత్రి మంత్రం జపిస్తూ విలన్స్ తో ఫైట్ చేయడం, ఆ సీన్ లో అల్లు అర్జున్ చెప్పులు వేసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బెజవాడ మూవీలో రౌడీలు ఫేమస్ అనేలా తీసిన సినిమాపై కూడా టైటిల్ విషయంలో గొడవలు వచ్చాయి. నెక్ట్స్ డైరెక్టర్ క్రిష్ తీసిన కృష్టం వందే జగద్గురుమ్ మూవీలో సినిమా అంతా బళ్లారి మైనింగ్ పై తీశారు. దీంతో పొలిటికల్ పార్టీలు గొడవ చేశాయి. నెక్ట్స్ కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీలో డైలాగ్స్ పై విమర్శలు వచ్చాయి.

నెక్ట్స్ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మగధీర మూవీలో ఏం పిల్లడో వెళ్దాం వస్తవా అనే సాంగ్ ని లిరిసిస్ట్ వంగపండు ప్రసాద్ రావు అనుమతి లేకుండా చేశారని పెద్ద గొడవే జరిగింది. ఫైనల్ గా అతనితో మాట్లాడి సెటిల్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయని వ్యతిరేకించారు. ఏపీలోని రాజకీయాలపై తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాపై తీవ్ర దుమారమే రేగింది. రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ పై కూడా ఓ రేంజ్ లో విమర్శలు వచ్చాయి. మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీలో బ్రాహ్మణులను ఎగతాళి చేశారని వివాదం చెలరేగింది. గద్దల కొండ గణేష్ అనే మూవీకి ఫస్ట్ వాల్మీకి అనే పేరు ఫిక్స్ చేశారు. టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో టైటిల్ ను మార్చి రిలీజ్ చేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...