Home Film News నరేష్ ‘సభకు నమస్కారం’!
Film News

నరేష్ ‘సభకు నమస్కారం’!

Naresh Sabhaku Namaskaram

కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా టైటిల్ ని ‘సభకు నమస్కారం’ గా నిర్ణయించారు. చివరిగా నరేష్ నాంది అనే డ్రామాలో కనిపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఏ పాత్రతో కనిపిస్తాడో చూడాల్సి ఉంది. నరేష్ కి కామెడీ హీరోగా మంచి పేరుంది. కేవలం ఆ తరహా సినిమాలు చేస్తూనే మంచి పేరు సంపాదించాడు. దాదాపు అన్ని సినిమాల రూపంలో మంచి సక్సెస్ కూడా చూశాడు. ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న నరేష్ ఈ సినిమాతో ప్రేక్షకులని ఎలా అలరించబోతున్నాడో వేచి చూడాలి.

ఈ సినిమా నరేష్ కి 58 వ సినిమా. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుందని చెప్తున్నారు. మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా వ్యవవహరిస్తున్నది మహేష్ కోనేరు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకి అబ్బూరి రవి డైలాగ్స్ రాశాడు.

మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది అన్న ఈ అప్డేట్ ఇవ్వడానికి గల కారణం ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడం. జూన్ 30 1982 లో పుట్టిన నరేష్ కి నేటితో 39 ఏళ్లు. నటుడిగా మాత్రమే కాకుండా మంచి వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్న నరేష్ ఇండస్ట్రీలో మరిన్ని పెద్ద హిట్ లు కొట్టాలని కోరుకుందాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...