Home Film News రెండో పెళ్లిపై నిహారిక క్లారిటీీ.. రెండో భర్త అతనేనా..!?
Film News

రెండో పెళ్లిపై నిహారిక క్లారిటీీ.. రెండో భర్త అతనేనా..!?

మెగా డాటర్ నిహారిక విడాకులతో అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో దాంపత్య జీవితానికి స్వస్తి పలికి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు రావడంతో పెళ్లైన రెండు సంవత్సరాలకే విడిపోయారు. అయితే విడాకులు తర్వాత వీరి మధ్య వచ్చిన గొడవలు ఏమిటి.. ఎందుకు విడిపోయారు ఇటు చైతన్య కానీ నిహారిక కానీ ఎప్పుడు స్పందించలేదు. ఈ క్రమంలోనే మొదటిసారిగా నిహారిక వాటిపై స్పందించింది. పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయలేదు పెళ్లి చేసుకోవడం వల్లే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారు. మావ‌దిన లావణ్యని కూడా ఇదే ప్రశ్న అడిగారు అది మా వృత్తి మేము ఎందుకు వదిలేస్తాం.

Chiranjeevi's Niece, Niharika Konidela And Her Husband, Chaitanya Head For Divorce, Reports Suggest

ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండటంతో కొంత సినిమాలకు దూరమయ్యాను అంతే.. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి ఒకరు ముందుగా తెలుసుకోవాలి అది తెలియకుండా పెళ్లి చేసుకుంటే మనకి సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదు. వాళ్లు మన ఇంట్లో మన అమ్మ నాన్నల ఉండరు కదా. అంత ప్రేమగా అసలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అది మా ఇంట్లో వారు కుదుర్చున వివాహం.. విడాకులు తీసుకుంటున్న సమయంలో కూడా చాలా మాటలు అన్నారు..అస‌మ‌యంలో బాగా ఏడ్చాను అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలని పెళ్లి చేసుకుంటారు.

రెండ‌వ పెళ్లి పై నిహారిక అభిప్రాయ‌మిది!

సంవ‌త్స‌రంలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు కదా.. కానీ ఏది ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా..మనం అనుకున్నవే జరగాలని లేదు. విడాకుల తరువాత నా గురించి చాలా రాసుకొచ్చారు. నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ, నా క్యారెక్ట‌ర్ ని త‌ప్పుబ‌ట్టారు.. నా కుటుంబాన్ని దూషించారు.. అప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోయాను. కానీ, నా కుటుంబం నన్ను ఎప్పుడు బరువనుకోలేదు. ఈ రెండేళ్ల‌లో కుటుంబం విలువ ఏంటో తెలిసింది. పెళ్లి-విడాకుల త‌ర్వాత ఎవ‌ర్నీ న‌మ్మ‌కూడ‌ద‌ని అర్దమైంది. ఇదొక గుణపాఠం. నేను ఎప్పటికీ ఒంట‌రిగా ఉండాలనుకోవడం లేదు.. నా వయస్సు 30 మాత్రమే.. మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా మ‌రోపెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక చేసిన‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...