Home Film News విడాకులపై మొద‌టిసారి మాట్లాడిన నిహారిక.. పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన మొద‌టి భర్త..!
Film News

విడాకులపై మొద‌టిసారి మాట్లాడిన నిహారిక.. పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన మొద‌టి భర్త..!

మెగా డాటర్ నిహారిక మెగా ఫ్యామిలీ అమ్మాయిగానే కాకుండా నటిగా కూడా అందరికి తెలుసు. గతంలో చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మొదటిసారి తన విడాకులపై పూర్తిగా మనసు విప్పి మాట్లాడింది నిహారిక. యూట్యూబర్ నిఖిల్ యూట్యూబ్ లో ‘నిఖిల్ తో నాటకాలు’ అనే పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేశాడు.

Who Is Chaitanya Jonnalagadda? Here's Everything You Need To Know About Niharika Konidela's To-Be Husband - Filmibeat

ఈ నేపథ్యంలోనే తన ఫ్రెండ్ అయిన నిహారికని తాజాగా ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి నిహారికని తీసుకొచ్చాడు. నిహారిక ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి, విడాకులు, ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, సినిమాలు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు.. ఇలా అన్ని విషయాలు మాట్లాడింది. అయితే ఈ ఇంటర్వ్యూని ఒక ప్రోమోలాగా కట్ చేసి సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశాడు నిఖిల్. ఈ ప్రోమోలో ఎక్కువగా విడాకుల వల్ల నిహారిక బాధపడినట్లు ఎమోషనల్ గా చూపించాడు. అయితే ఈ వీడియోకి నిహారిక మాజీ భర్త చైత‌న్య‌ సంచలన కామెంట్లు చేశాడు.

సోషల్ మీడియాలో నిహారిక ఇంటర్వ్యూ ప్రోమో కింద నిహారిక మాజీ భర్త చైతన్య.. హాయ్ నిఖిల్, నిహారికపై వచ్చిన నెగిటివిటి గురించి లేట్ అయిన మాట్లాడి అందరికి తెలియచేసినందుకు నేను నీను అభినందిస్తున్నాను. అలాంటి వ్యక్తిగత కామెంట్స్ ఎదుర్కోవడం ఎంత‌ కష్టమో నాకు తెలుసు. కానీ ఇండైరెక్ట్ గా అందులో ఉన్న బాధితుల గురించి ఇలా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇలా జరగడం రెండోసారి. ఆ బాధ రెండువైపులా ఒకే విధంగా ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడకూడదు, ముఖ్యంగా ఒకవైపే మాట్లాడకూడదు. దానివల్ల బాధపడిన వాళ్ళ గురించి జోక్యం చేసుకోకూడదు.

chaitanya

దానికంటే వచ్చిన బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడింది మాట్లాడితే ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించు. కానీ ఏమి తెలియకుండా కేవ‌లం ఒకవైపు జడ్జి చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు. అర్ధం చేసుకుంటావు అనుకుంటున్నాను అని కామెంట్స్ చేశాడు. ఇక దీంతో నిహారిక ఇంటర్వ్యూ తో పాటు చైతన్య చేసిన కామెంట్‌ కూడా వైరల్ గా మారాయి. నిహారికతో జరిగిన ఇంటర్వ్యూలో ఇద్దరి గురించి చెప్పకుండా చైత‌న్య‌దే అంతా తప్పు అన్నట్టుగా చూపించినట్టు కామెంట్ చేశాడు. ఇక ఆ కామెంట్ కి పలువురు నెటిజెన్లు సైతం చైతన్యకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి నిహారిక తన మాజీ భర్త కామెంట్‌పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...