Home Film News Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌
Film News

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా. హ్యాపీడేస్ మూవీతో తెలుగు యువత గుండెల్లో చిచ్చు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల‌లో కూడా న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సౌత్, నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో తెగ బిజీగా ఉంది. ఇటీవలే జైలర్, భోళా శంకర్ మూవీస్‍తోపాటు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసులతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించింది. అయితే ఈ అమ్మ‌డు ప్రేమలో పడ్డారని మీడియా కోడైకూసింది.నటుడు విజయ్ వర్మతో ఆమె సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో తమన్నా త‌న ఎఫైర్‌పై ఇటీవల ఓపెన్ అయ్యింది.

 

విజయ్ వర్మతో నా రిలేషన్ నిజమేనని కుండబద్దలు కొట్టిన ఈ భామ‌.. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే చాలా మంది హీరోలతో పని చేసిన‌ప్ప‌టికీ, విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం. నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను అంటూ త‌మన్నా ఆయ‌న గురించి గొప్ప‌గా చెప్పుకొచ్చింది. ఆయ‌న‌తో రిలేష‌న్ గురించి ఓపెన్ అయిన త‌మ‌న్నా జంట విరామం దొరికితే విహారాలకు చెక్కేస్తున్నారు. తాజాగా మాల్దీవ్స్ వెళ్లారు. అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

అయితే మాల్దీవ్స్ నుండి వ‌స్తున్న స‌మ‌యంలో విజయ్ వర్మ ఎక్కడని త‌మ‌న్నాని మీడియా ప్రశ్నించింది. ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అనంతరం విజయ్ వర్మ వచ్చాడు. ఆయన్ని ఒకరు ‘మాల్దీవ్స్ లో బాగా ఎంజాయ్ చేశారా? అని అడిగారు. ఆ ఇబ్బందికర ప్రశ్నకు విజయ్ వర్మ అసహనం ఫీల్ అయ్యాడు. ఇలా మాట్లాడటం సరికాదని విజయ్ అన్నారు. ఇక పెళ్లి ఎప్పుడంటే వీరిద్దరూ స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వడం లేదు. మరోవైపు జైలర్ చిత్రంలో న‌టించిన త‌మ‌న్నా ఈ సినిమాతో త‌న డ్యాన్స్ తో అద‌ర‌గొట్టింది. ఈ మూవీ రూ. 650 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అయితే జైలర్ లో తామన్నప్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...