Home Film News నాగ‌ర్జున నిర్మ‌త‌గా చిరంజీవి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..!
Film News

నాగ‌ర్జున నిర్మ‌త‌గా చిరంజీవి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..!

సాధారణంగా స్టార్ హీరోల అభిమానుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మన టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసి మెలిసి ఒకే కుటుంబంల ఉంటూ వస్తున్నారు. కొంతమంది హీరోలైతే సరి సమానమైన క్రేజ్ ఉన్నప్పటికీ కూడా సొంత అన్నదమ్ముల్లా ఉంటూ వస్తున్నారు. వారిని అలా చూస్తే వారి అభిమానుల కళ్ళ నుంచి ఆనందంతో నీళ్లు వస్తుంటాయి. అలాంటి వారిలో మనం ముందుగా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకోవాలి.

Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన సినిమా  ఏంటో తెలుసా ?.. అస్సలు ఊహించి ఉండరు కదా.. - Telugu News | Do you know the  movie which starred ...

నాలుగు దశాబ్దాల నుంచి వీరిద్దరి స్నేహం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. నాగార్జున- చిరంజీవిని సొంత అన్నయ్య లాగా భావిస్తాడు. ఇద్దరు స్టార్ స్టేటస్ విషయంలో తక్కువేమీ కాదు.. ఇద్ద‌రి హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో మరియు బయట ఎన్నో గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇద్దరు హీరోలు మాత్రం సొంత అన్నదమ్ములు లాగానే ఉంటూ వస్తున్నారు. ఇంత మంచి స్నేహబంధం ఉన్నప్పటికీ కూడా ఇద్ద‌రు కలిసి ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదు. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు.

Chiranjeevi wishes Nagarjuna on his birthday, shares old photo with 'dear  friend' - India Today

కానీ చిరంజీవిని హీరోగా పెట్టి నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సినిమా చేయాలని భావించారు. ఆ సినిమాకి దర్శకుడుగా కె.రాఘవేంద్ర రావుని కూడా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్‌గా సౌందర్యని రెండు పాటలు మరియు కొంత భాగం షూటింగ్ను కూడా పూర్తి చేశారు. కానీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావుకు సినిమా కథ మరోసారి పరిశీలించి చూస్తే.. ఈ కథ చిరంజీవి ఇమేజ్ కి తగ్గ సినిమా కాదని భావించారట. క‌థ‌లో ఎక్కడో ఏదో మిస్ అవుతుందని అనుకున్నారట. ఎంత ప్రయత్నించినా కథని సెట్ చేయాలని చూసినా అది చిరంజీవి ఇమేజ్‌కు వర్కర్ అయ్యేలా కనిపించలేదట.

Chiranjeevi,HBD Raghavendra Rao: ద‌ర్శ‌కేంద్రుడికి మెగా విషెస్..  అభిమానాన్ని చాటుకుంటూ పోస్ట్ - chiranjeevi special wishes to director  raghavendra rao - Samayam Telugu

ఇదే విషయాన్ని ముందుగా రాఘవేందర్రావు.. నాగార్జునకు చెప్పారట. అప్పుడు నాగార్జున మీకు నమ్మకం లేకపోతే ఈ సినిమాని ఆపేద్దాం. వేరే ఏదైనా మంచి కథ ఉంటే సినిమా చేద్దామని చెప్పాడట. మరి చిరంజీవి డేట్స్ ని ఏమి చేస్తారు, అతను మనకి నాన్ స్టాప్ గా నెల రోజులు డేట్స్ ఇచ్చారు కదా అని రాఘవేందర్రావు నాగార్జునతో అనగా, ఆయనకి నేను నచ్చచెప్పుకుంటాను ఏమ్‌ పర్వాలేదు అని అన్నాడు నాగ్‌. త‌ర్వాత ఇదే విష‌య‌న్నీ చిరంజీవికి చెప్పగా, ఆయన చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడట. కానీ నెల రోజులు డేట్స్ వేస్ట్ అయ్యాయి కదా, ఈ నెల రోజులు ఫారెన్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటానులే అని నాగార్జునతో చెప్పాడట. ఈ విధంగా నాగార్జున నిర్మాతగా చిరంజీవి హీరోగా రావాల్సిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...