Home Film News క్లిష్ట పరిస్తితుల్లో అఖిల్ చేస్తున్న రిస్క్?!
Film News

క్లిష్ట పరిస్తితుల్లో అఖిల్ చేస్తున్న రిస్క్?!

Akhil taking too many risks

కుటుంబమంతా సక్సెస్ ఫుల్ సినిమా వాళ్ళు ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన అక్కినేని అఖిల్ కి వ్యక్తిగతంగా ఎలాంటి సక్సెస్ దొరకలేదు ఇప్పటివరకు. వివి వినాయక్ వంటి పెద్ద దర్శకుడితో మొదటి సినిమా అతని పేరుతోనే తీసినా ఆ మూవీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. మాసెస్ ని అసలే ఆకట్టుకోలేకపోయింది. నితిన్ ఆ సినిమా స్వయంగా డబ్బులు కూడా పెట్టాడు. ఏ మాత్రం లాభం లేదు. అయినా అఖిల్ తన కెరీర్ ని అక్కడితో ఆపేయలేదు. మళ్ళీ కొన్ని సినిమాలు చేసాడు.

హలో, మజ్ను అనే మరో రెండు సినిమాలు చూశాడు. ఆ రెండు సినిమాలు కూడా అంత గొప్ప సినిమాలుగా ఏమీ నిలబడలేదు. నామమాత్రంగా ఆడిన ఆ సినిమాల తర్వాత అఖిల్ పూజా హెగ్డే తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేసాడు. కానీ ఆ మూవీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. ఏవేవో కారణాలతో సినిమా అలా ఆగిపోతూనే వస్తోంది. ఇక చివరికి ఆ సినిమాని నేరుగా ఓటీటీ లోకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు టీం.

ఐతే, ఆ సినిమా తర్వాత కూడా అఖిల్ సక్సెస్ చూడలేడేమోననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అఖిల్ ఫుల్ టైమ్ గా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడేళ్ళు గడుస్తున్నాయి. ఇంకా సక్సెస్ చూడని ఈ పరిస్థితుల్లో అఖిల్ శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరోపక్క శ్రీను వైట్లకి కూడా గత కొన్నేళ్లుగా ఎలాంటి హిట్స్ లేవు. ఈ ప్రయత్నం అఖిల్ ని మోస్ట్ డిజాస్టరస్ ఆక్టర్ గా నిలబెడుతుందేమోనని కొందరి ఆందోళన.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...