Home Film News Niharika Chaitanya: నిహారిక‌-చైతన్య‌ల‌లో ముందుగా విడాకుల పిటీష‌న్ వేసింది ఎవ‌రు..!
Film News

Niharika Chaitanya: నిహారిక‌-చైతన్య‌ల‌లో ముందుగా విడాకుల పిటీష‌న్ వేసింది ఎవ‌రు..!

Niharika Chaitanya: కొద్ది నెల‌ల క్రితం టాలీవుడ్‌లో స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారం ఎంత పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయిందో మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టికీ కూడా వారి విడాకుల గురించి ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంటుంది. ఈ ఇష్యూలో స‌మంత‌దే త‌ప్పు అంటూ చాలా మంది గ‌ట్టిగా చెప్పారు. ఇక తాజాగా నిహారిక‌- చైత‌న్య విడాకుల‌పై అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది. కొన్నాళ్లుగా వారి విడాకుల అంశంపై ఎన్ని ప్ర‌చారాలు వ‌చ్చిన కూడా ఎవ‌రు స్పందించ‌లేదు.అయితే  ఫ్యామిలీ కోర్టు గత నెల 5న వారికి విడాకులు మంజూరు చేయ‌గా, జూలై4న విడాకుల కోసం నిహారిక ద‌ర‌ఖాస్తు చేసుకున్న పిటీష‌న్ నెట్టింట వైర‌ల్ అయింది. దీంతో వీరి విడాకుల‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది.

ఇక ఇప్పుడు అంత‌టా నిహారిక‌- చైత‌న్య‌ల విడాకుల గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఏ కార‌ణం వల‌న వారిద్దరు విడాకులు తీసుకున్నారు. పెళ్లి అయిన కొద్ది రోజుల‌కే విడిపోవ‌డం వెన‌క కార‌ణం ఏంట‌నే ఆరాలు తీస్తున్నారు.  అయితే వీరిద్దరూ కోర్టులో చేసిన పిటిషన్ ప్రకారం.. ముందుగా చైతన్యనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సోష‌ల్ మీడియాలో కూడా ముందు చైత‌న్య‌నే పెళ్లి ఫొటోలు డిలీట్ చేశాడు. ఆ త‌ర్వాత‌నే నిహారిక డిలీట్ చేసింది. ఇక  నిహారిక తరుపున ఫిటిషన్ ఏ లాయర్ వేసార‌నే దానిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.  నిహారిక తరపున పిటిషన్ వేసింది, పవన్ కళ్యాణ్ కి అభిమానిగా, జనసేన మద్దతు దారుడిగా ఉన్న కళ్యాణ్ దిలీప్ సుంకర.

తాజాగా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న‌ పిటిషన్ లో అతడి పేరు ఉంది.  నాగబాబుకు..కళ్యాణ్ దిలీప్ సుంకర చాలా సన్నిహితంగా ఉంటారు.  ఈ క్ర‌మంలోనే అత‌ని ద్వారా నిహారిక విడాకుల ప్ర‌క్రియ పూర్తైంద‌ని టాక్. విడాకుల త‌ర్వా నిహారిక తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. నిర్మాత‌గా కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. ఇక చైతన్య ప్ర‌స్తుతం వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. కాగా, నిహారిక‌-చైత‌న్య‌ల వివాహం  2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మ‌హోత్స‌వ‌ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు  పాల్గొన్నారు.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...