Home Film News Samantha: స‌మంత జీవితంలోకి కొత్త మెంబ‌ర్.. బెడ్‌పై అవేమి ప‌నులు…!
Film News

Samantha: స‌మంత జీవితంలోకి కొత్త మెంబ‌ర్.. బెడ్‌పై అవేమి ప‌నులు…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రాంతాల‌లో చక్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే.మ‌యోసైటిస్ వ్యాధితో  ఇబ్బంది ప‌డుతున్న స‌మంత ఏడాది పాటు త‌న ప‌నుల‌కి బ్రేక్ ఇచ్చి పూర్తి దృష్టి ఆరోగ్యంపైనే పెట్టాల‌ని అనుకుంటుంద‌ట‌. చివ‌రిగా యశోద, శాకుంతలం చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన సమంత రీసెంట్‌గా  విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమా చేసింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, మూవీని సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక   సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా  చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ షూట్ కూడా రీసెంట్‌గానే కంప్లీట్ అయ్యింది.

నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సోలో జీవితం గ‌డుపుతుంది. మ‌ళ్లీ పెళ్లి మాట ఎత్త‌కుండా సింగిల్‌గా ఉంటూ వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. అయితే  సమంత   జీవితంలోకి ఇటీవ‌ల మరోక కొత్త మెంబర్ వచ్చారు. ఈ విష‌యాన్ని స‌మంత స్వ‌యంగా తెలియ‌జేసింది.స‌మంత‌కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. ఇప్ప‌టికే స‌మంత ద‌గ్గ‌ర  హష్ అనే కుక్కపిల్లతో పాటు నాషా అనే  మరో పెట్ డాగ్ కూడా ఉంది. వీటితో అప్పుడ‌ప్పుడు ఫొటోలు దిగుతూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సమంత‌. ఇక రీసెంట్‌గా  సమంత తన ఫ్యామిలీలోకి మరో పెట్ ని తీసుకువచ్చింది. పిల్లికి గ‌లాటో అని ముద్దుగా పేరు పెట్టుకున్న స‌మంత దానిని పెంచుకుంటుంది.

అంతేకాదు బెడ్‌పై ఫొటోలు దిగి ఆ పిక్ షేర్ చేసింది. ఇది చూసిన కొందు నెటిజ‌న్స్ పిక్ అదిరింది అని అంటున్నారు. మ‌రి కొంద‌రు పెట్స్ తో మ‌రీ అంత స‌న్నిహితంగా ఉండ‌కు. అస‌లే ఆరోగ్యం విష‌యంలో చాలా ఇబ్బందులు ప‌డుతున్నావు. వాటితో బెడ్‌పై ప‌డుకోపెట్టుకుంటే ఇన్‌ఫెక్ష‌న్స్ వ‌చ్చి ఇబ్బందులు ప‌డ‌తావు అని కొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు. కాగా,  కొన్నాళ్లుగా  మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న  సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుంది.. అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలకి తిరిగి చెక్కులు ఇచ్చేసింద‌ట‌. ఇప్పుడు త‌న పూర్తి  దృష్టి ఆరోగ్యంపైనే అంటుంద స‌మంత‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...