Home Film News Ram Charan-NTR: చ‌రణ్ కూతురిని చూడ‌డానికి తార‌క్ అందుకే వెళ్లలేదా..విష‌యం తెలుసుకొని ప్ర‌శంస‌లు
Film News

Ram Charan-NTR: చ‌రణ్ కూతురిని చూడ‌డానికి తార‌క్ అందుకే వెళ్లలేదా..విష‌యం తెలుసుకొని ప్ర‌శంస‌లు

Ram Charan-NTR: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మ‌ధ్య మంచి స్నేహం ఉన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో న‌టించ‌గా, ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్ స‌మయంలో వారిద్ద‌రు త‌మ ఫ్రెండ్‌షిప్ గురించి తెలియ‌జేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ క‌న్నా ముందే మా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఉంది. మేము క‌లిసి స‌ర‌దాగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాం. మేము ఇద్ద‌రం భిన్న ధృవాల్లాంటి వ్య‌క్తులం కావ‌డం వ‌లన మా మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. భిన్న ధ్రువాలు ఆక‌ర్షింపబ‌డ‌తాయ‌నే సూత్రం ఆధారంగానే మా మ‌ధ్య ఫ్రెండ్షిప్ వ‌ర్క్ అయిందని భావిస్తాను. టాలీవుడ్ సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ స‌మ‌యంలో మంచి స్నేహం మా ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డింది అని అన్నారు ఎన్టీఆర్.

అయితే త‌న ఫ్రెండ్ అయిన రామ్ చ‌రణ్ 11 ఏళ్ల త‌ర్వాత పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా, ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే రామ్ చరణ్ కి బిడ్డ పుట్టాక‌ ఇప్పటి వరకు ఆమెను చూడటానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదట. వీరిద్దరూ అంత బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. మరీ రామ్ చరణ్ కూతురును చూడటానికి వెళ్ల‌క‌పోవ‌డం ఏంట‌నే ప్రశ్న మొదలైంది. అయితే అందుకు కార‌ణంగా నంద‌మూరి అభిమానులు ప‌లు విష‌యాలు చెప్పుకొస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది వ‌ర్షాకాల సీజ‌న్ కాగా, ఈ సీజన్ లో చిన్నపిల్లలకు త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.

 

తారక్ గ‌త కొద్ది రోజులుగా దేవ‌ర అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న చాలా మందిని కలుస్తుంటారు. ఈ క్ర‌మంలో త‌న నుండి పాప‌కి ఇన్‌ఫెక్ష‌న్ సోకుతుంద‌నే భ‌యంతో ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ కూతురిని చూడ‌లేద‌ట‌. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు కూడా బయటి వారిని ఇంట్లోకి రానివ్వడం లేదని టాక్ న‌డుస్తుంది. అయితే రామ్ చ‌ర‌ణ్ కూతురి విష‌యంలో ఎన్టీఆర్ ఆలోచించిన విధానం ప‌ట్ల ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...