Home Film News Vishal:ఆ యంగ్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త‌మిళ న‌టుడి వివాహంపై జోరుగా చ‌ర్చ‌లు
Film News

Vishal:ఆ యంగ్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త‌మిళ న‌టుడి వివాహంపై జోరుగా చ‌ర్చ‌లు

Vishal: త‌మిళ న‌టుడు విశాల్ ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే. తన ప్ర‌తి సినిమా కోసం నూటికి నూరు శాతం ఎఫ‌ర్ట్ పెట్టే విశాల్ ప‌లుమార్లు ప్ర‌మాదాల బారిన కూడా ప‌డ్డాడు. విశాల్ పేరుకి త‌మిళ హీరో అయిన తెలుగులోను ఆయ‌నకి విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ ప్ర‌తి సినిమా తెలుగులో విడుద‌ల కావ‌ల్సిందే. ఆయ‌న న‌టించిన కొన్ని సినిమాలు తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న విశాల్ పెళ్లికి సంబంధించి ఇప్పుడు అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. విశాల్ త్వ‌ర‌లోనే ఓ యువ హీరోయిన్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడ‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు.

వివ‌రాలలోకి వెళితే.. విశాల్ వయస్సు ప్రస్తుతం 45 ఏళ్లు కాగా, ఆయ‌న ఇప్ప‌టికీ స్టిల్ బ్యాచిల‌ర్‌గా ఉన్నారు. లాక్‌డౌన్‌కి ముందు అనీషా అనే యువ‌తితో విశాల్ నిశ్చితార్థం అయిన కూడా ఆ బంధం పెళ్లి వ‌ర‌కు సాగ‌లేదు. విశాల్‌కి బ్రేక్ చెప్పిన అనీషా వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది. కాని విశాల్ మాత్రం ఇంకా పెళ్లి జోలికి వెళ్ల‌డం లేదు. ఆయ‌న క‌నిపించిన‌ప్పుడ‌ల్లా అభిమానుల నుంచి, శ్రేయోభిలాషుల నుండి మీ పెళ్లి ఎప్పుడు? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతూనే ఉంది. కొన్ని సార్లు ఆ ప్ర‌శ్న‌ని తెలివిగా దాట‌వేస్తూ వ‌స్తున్నారు. అయితే కోలీవుడ్ స‌మాచారం మేర‌కు విశాల్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రి వివాహంకి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు.

 

ల‌క్ష్మీ మీన‌న్- విశాల్ క‌లిసి గతంలో ‘పాండియనాడు’,‘ఇంద్రుడు వంటి సినిమాల‌లో క‌లిసి నటించారు. వీరి పెయిర్‌ ఆడియెన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. కొంద‌ర‌తై రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను ఒక్క‌టైతే బాగుంటుంద‌ని చెప్పుకొచ్చారు. చూస్తుంటే వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే అది నిజం చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. వారి ప్రేమ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట్లో వాళ్ల‌కు కూడా తెలియ‌ద‌ని, వారిని ఒప్పించి అంతా ఓకే అనుకుంటే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెంట‌నే రానుంద‌ని స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే లక్ష్మీ మీనన్ చాలా రోజుల తర్వాత ‘చంద్రముఖి2’తో వెండితెరపై క‌నిపించి సంద‌డి చేయ‌నుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...