Home Film News భర్త కోసం నటి దీప్తి చేసిన పనికి ‘హ్యాట్సాఫ్ మేడమ్’ అంటున్న నెటిజన్స్..
Film News

భర్త కోసం నటి దీప్తి చేసిన పనికి ‘హ్యాట్సాఫ్ మేడమ్’ అంటున్న నెటిజన్స్..

DIPTI DHYANI FAMILY
DIPTI DHYANI FAMILY

సెలబ్రిటీలు ఏం చేసినా చూసేవాళ్లకి సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటుంది. మన చుట్టుపక్కల వాళ్లు సెన్సేషన్ క్రియేట్ చేసే న్యూస్‌కి కారణమైనా కానీ మనకి న్యూసెన్స్‌గానే ఉంటుంది. అదే ఎవరైనా ఓ సెలబ్రిటీ వాళ్ల పెట్‌తో కనిపించినా సరే నోరెళ్లబెట్టి మరీ చూస్తుంటాం. కొన్నిసార్లు అయితే.. ఆ, ఇదేమంత వింతలే అనుకుంటూ ఉంటాం. మరికొంతమంది చేసే మంచి పనులు చూసి మెచ్చుకుంటూ ఉంటాం.. ఒకోసారి స్పూర్తి కూడా పొందుతుంటాం. ఇప్పుడలాంటి ఓ హార్ట్ టచ్చింగ్ న్యూస్‌తో సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీని గురించిన ఇష్యూ ఒకటి వైరల్ అవుతోంది.

మీరు చూస్తున్న ఈ మహిళ పేరు దీప్తి ధ్యాని. నార్త్‌లో సీరియల్ నటి. పాపులర్ నటుడు సూరజ్ థాపర్ రెండో భార్యే దీప్తి. భర్త మీద ప్రేమతో దీప్తి చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలిచింది. గతంలో సూరజ్ కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 70 శాతం ఆయన లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి. భర్త ఆరోగ్యం కోసం దీప్తి ప్రతీ గుడికి వెళ్లి ప్రార్థించేవారు.

భర్త తిరిగి కోలుకోవాలని ఎన్నో ప్రదేశాల్లోన్ని ప్రముఖ దేవాలయాల్లో దీప్తి పూజలు జరిపారు. కొంతకాలానికి సూరజ్ ఆరోగ్యం మెరుగుపడింది. భర్త సంపూర్ణ ఆరోగ్యంతో మునుపటి స్థితికి చేరుకోవడంతో దీప్తి ప్రార్థనలు ఫలించాయి. దీంతో ఆమె తిరుపతి వెంకటేశ్వరస్వామికి భక్తితో తలనీలాలు సమర్పించారు. ‘‘అందమైన, పొడవాటి జుట్టుని దేవుడికి సమర్పించి, భర్త మీద ప్రేమని, దైవ భక్తిని చాటుకుని, మరికొందరు మహిళలకు ఆదర్శంగా నిలిచారు.. రియల్లీ యువర్ గ్రేట్ మేడమ్’’ అంటూ నెటిజన్స్ దీప్తిని ప్రశంసిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...