ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో చిత్రం RRR అని తెల్సిన విషయమే. ఇప్పటిదాకా జక్కన్న చేసిన బాహుబలి ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో, మొట్ట మొదటి సారి ఒక తెలుగు సినిమాగా మిగిలిన అన్ని భాషల సినిమాలను పక్కకు నెట్టి ఎలా ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకుందో మనం చూశాం. ఇందుకు ప్రధాన కారణం ఆ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు.. కథ అద్భుతంగా ఉండటం, అలాగే మ్యూజిక్ కూడా ఎంతో హిట్ అవడం కూడా కారణాలని చెప్పుకోవచ్చు. ఇదంతా రాజమౌళి ఇండస్ట్రీలోకి వచ్చిన తనని తాను నిరూపించుకునేందుకు దారి చూపిన కె. రాఘవేంద్ర రావ్ గారు.
అతని శిష్యుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన రాజమౌళి అందుకు తగ్గట్టుగానే.. ఎన్నో లక్షణాలని తన సినిమాలలో చూపిస్తూ వచ్చాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే.. అలాగే పాటల విషయంలో కూడా రాజమౌళి ఒక ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ అలవాటు వల్లే గురువుకి మించిన శిష్యుడు అనిపించుకోగలిగాడు. మిగతా దర్శకులతో పోల్చితే.. షూటింగ్ కి ఎక్కువ సమయం తీసుకుంటాడు అన్న ఒక నెగెటివ్ కామెంట్ ఆయన పట్ల వినబడుతూ ఉంటుంది. కానీ, అందుకు ఒక కారణం ఉంది. ఎక్కువ టైమ్ తీసుకుని ఐనా సరే ఔట్పుట్ ఎంతో మంచిగా ఉండాలి అనుకునే స్వభావం రాజమౌళిది. దానిని జస్టిఫై చేయగలిగినా ఆయనపై ఉన్న మరో నెగెటివ్ కామెంట్ ని మనం అంత సులభంగా జస్టిఫై చేయలేము. అదే ఆయన సీన్ లని ఇంకా రకరకాలుగా సినిమా నిర్మాణానికి సంబంధించిన విషయాలని కాపీ కొడతారన్న అభిప్రాయం ఉండటం.
ఐతే అది నిజమేనని అనిపించే ఒక సంధర్భం ఈ మధ్య మళ్ళీ తెరపైకి వచ్చింది. అదే.. rrr మూవీ టీం సినిమాని ప్రమోట్ చేయటం కోసం రూపొందించిన ఒక ప్రమోషనల్ సాంగ్ విషయం. ఈ సాంగ్ లో వివిధ భాషలకి చెందిన సంగీత దర్శకలు ఒక్కచోట చేరి డ్రమ్స్ వాయిస్తూ.. అలాగే.. వాళ్ళ వెనకాల చివర్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉండటం కూడా సెన్సేషనల్ అవుతోంది. ప్రమోషన్ పరంగా కాస్త సక్సెస్ అయ్యారనే చెప్పినా కూడా.. ఈ సాంగ్ ని మరో పాపులర్ దర్శకుడైన తమన్ నుంచి కాపీ కొట్టారన్న పుకార్లు మొదలయ్యాయి. అసలు తమనే పెద్ద కాపీ రాయుడు అంటే.. ఆ కాపీ రాయుడినుంచే కాపీ కొట్టిన మీరు అంతకన్నా పెద్ద కాపీ రాయుళ్ళు అని ట్రోల్ చేస్తున్నారు. ఇలా RRR సినిమాకి సంబంధించి ఇది అతి పెద్ద నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనుకోవచ్చు. ఇకపోతే, సినిమా కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న వాళ్ళు అసలు ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటున్నారు.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.