Home Film News నా కొడకల్లారా తెగించినోడిని పండబెట్టి నరుకుడే.. ఈ ఊర మాస్ నరుకుడు ఏంట్రా బాబు.. దేవర గ్లింప్స్(వీడియో)..!
Film News

నా కొడకల్లారా తెగించినోడిని పండబెట్టి నరుకుడే.. ఈ ఊర మాస్ నరుకుడు ఏంట్రా బాబు.. దేవర గ్లింప్స్(వీడియో)..!

ఎన్నో రోజులుగా కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అంటూ వెయ్యి కళ్లతో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన దేవర గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర.. టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ బయటికి వచ్చిన నందమూరి అభిమానుల కలలో కోటి కాంతులు కనిపించేవి.. కాగా కొద్దిసేపటి క్రితమే మేకర్స్ దేవర గ్లింప్స్ ను విడుదల చేశారు.

Image

తాజాగా వచ్చిన ఈ చిన్న గ్లింప్స్ ను తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు కొర‌టాల.. అంతేకాకుండా ఎన్టీఆర్ ని ఎలా అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో అదే విధంగా ఊరా మాస్ లుక్ లో చూపించాడు. ఒక విధంగా చెప్పాలంటే అది సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎంత కోపంగా కనిపించాడో ఇప్పుడు వచ్చిన దేవర గ్లింప్స్ లో కూడా మనకు అంతే కోపంగా గంభీరంగా కనిపిస్తాడు. శత్రువులను కంటిచూపుతోనే చీల్చి చెండాడే కాల యముడిలా తారక్ జీవించేసాడు.

Image

దేవర గ్లింప్స్ మొదలవటంతోనే పెద్ద పెద్ద పాడవల్లో కొంత మంది దోచుకోవడానికి వచ్చినట్లు చూపిస్తాడు.. అంతేకాదు వాళ్ళని నరుకుతూ ఎన్టీఆర్ చాలా వైల్డ్ యాంగిల్ లో మనకి దర్శనమిస్తాడు. అంతేకాకుండా అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలెట్గా నిలిచింది. సముద్రం ఒక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఇంగ్లీష్లో లిరిక్స్ రాసి అద్భుతంగా ఆకట్టుకున్నాడని చెప్పాలి. You never touch the sea.. You never play with me.. I’ll never show you mercy.. I’ll never let you be!

Image

అంతేకాకుండా చివర్లో తనకి అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరుకుతూ ఎన్టీఆర్ తన ఉరా మాస్ లుక్ ఏంటో పాన్ ఇండియా సినిమాకు చూపించబోతున్నాడు.. ఇక చివరిలో “ఈ సముద్రం చేపల కంటే ఎక్కువగా నెత్తురునే చూసి ఉంటుంది.. అందుకే ఎర్ర సముద్రం అంటూ పేరు వచ్చింది అంటూ తనదైన స్టైల్ లో డైలాగును చాలా వైలెంట్‌గా చెప్పి గ్లింప్స్ ని ఎండ్ చేశారు”. మొత్తానికి ఈ చిన్న గ్లింప్స్ తోనే సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాడు మన యంగ్ టైగర్. అంతేకాకుండా దేవర సినిమా ఖచ్చితంగా చరిత్ర తిరగరాయబోతుంది ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియా లెవ‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...