Home Film News అఖండ సినిమా నేపథ్యంలో బాలకృష్ణ గురించి పలువురు మాట్లాడిన వీడియో!
Film News

అఖండ సినిమా నేపథ్యంలో బాలకృష్ణ గురించి పలువురు మాట్లాడిన వీడియో!

Celebrities about Balakrishna character

బాలకృష్ణ సరికొత్త సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లో ఉన్న ఆయన అభిమానులని ఈ సినిమా మరింత ఎంటర్టైన్ చేయబోతుందని భావిస్తున్నారు అభిమానులు. లేటెస్ట్ గా శ్రేయాస్ మీడియా వాళ్ళు బాలయ్య గురించి పలువురు ప్రముఖులు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో అంతటా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఎవరెవరు ఏమేం మాట్లాడారో పరిశీలిద్దాం.

ముందుగా బోయపాటి శ్రీనివాస్, ఆయన ఒక నిలువుటద్దం లాంటి మనిషని ఆయన ముందుకు వచ్చేవాళ్ళు ఎలా ఉంటే అలా ఆయన కనిపిస్తాడు అని చెప్పారు. ఇకపోతే పూరీ జగన్నాథ్.. బాలకృష్ణ క్యారెక్టర్ ఉన్న మనిషని, మాట మీద నిలబడతాడని, మనుషులకి వాల్యూ ఇస్తాడని చెప్పాడు. నిజాన్ని నిజంగా చెప్తాడని, ఒక పాత్ర నచ్చింది అంటే ఆ పాత్రని మళ్ళీ ఎవరూ చేయలేని రీతిలో అద్భుతంగా నటిస్తాడని అన్నారు కోడి రామకృష్ణ. ఆయనొక డైనమిక్ ఫిగర్ అంటాడు పృధ్వీ రాజ్. ఇంకా పలువురు జూనియర్ ఆర్టిస్ట్ లు, క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఆయన్ని బాగా పొగిడారు.

వీటన్నిటికన్నా హైలైట్ అయ్యే విషయం స్వయంగా జూనియర్ ఎన్టీఆర్.. బాలయ్యకి కొడుకులు తక్కువ అభిమానులు ఎక్కువ అని అనడం.. అందరినీ కేరింతలు పెట్టించింది. అలాగే, కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణని పొగిడారు. తాతయ్య తరువాత సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరుని మోసిన నటుడిగా బాలకృష్ణ ఒక్కరే మిగిలిపోతారని.. మేమంతా మరో తరానికి చెందిన వాళ్ళమని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఇంకా తారక రత్న కూడా బాబాయ్ పై ఆయన అభిమానాన్ని వ్యక్తపరిచారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...