Home Film News Adipurush: ఆదిపురుష్‌పై ఆగ‌ని విమ‌ర్శ‌లు.. రాముడికి మీసాలుండడం ఏంటి?
Film News

Adipurush: ఆదిపురుష్‌పై ఆగ‌ని విమ‌ర్శ‌లు.. రాముడికి మీసాలుండడం ఏంటి?

Adipurush: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, అందాలు ముద్దుగుమ్మ కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓం రౌత్ తెర‌కెక్కించిన చిత్రం ఆదిపురుష్‌. జూన్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పౌరాణిక యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడు పాత్రలో నటించారు. ఇక సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకి, పాటలకు, వీడియోలకు సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. భారీ అంచనాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ విడుదలకానున్న నేపథ్యంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనాథ పిల్లలకు ఈ సినిమా చూపించడానికి ప‌దివేల టిక్కెట్లను బుక్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం రావ‌ల్సి ఉంది. ఇక బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా నిరుపేద పిల్లల కోసం 10వేల టిక్కెట్లను బుక్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదలైన విష‌యం విదిత‌మే. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టిక్కెట్స్ కొంటున్నట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఇక ప్ర‌తి థియేట‌ర్‌లో హ‌నుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా వ‌దిలేస్తున్న‌ట్టు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

 

ఒక‌వైపు సినిమాల‌పై ఓ రేంజ్‌లో భారీగా అంచ‌నాలు పెరుగుతుంటే, మ‌రోవైపు ఈ సినిమాపై విమ‌ర్శ‌ల వర్షం కురుస్తూనే ఉంది. ఆ మధ్య విడుదలైన టీజర్ పై ఎంత‌గా విమ‌ర్శ‌లు వ‌చ్చాయో మ‌నం చూసాం. అందులో గ్రాఫిక్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయని, కార్టూన్ షో చూసిన‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు అన్నారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ పై కూడా కొంతమంది పెద‌వి విరుస్తున్నారు. ఇక‌ సినిమాలో ప్రభాస్ లుక్ పై కూడా చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ కు మీసాలు ఉండటం ఏంట‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించారు.ఈ నేప‌థ్యంలో నిర్మాత విక్రమ్ స్పందిస్తూ … సినిమా చూస్తే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయనేది అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. అలానే విమర్శకులకు ఉన్న చాలా డౌట్స్ కు క్లారిటీ అయితే వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...