Home Film News Siddharth: పెద్దావిడ కాళ్ల మీద ప‌డి క‌న్నీరు పెట్టుకున్న స్టార్ హీరో.. అస‌లేం జ‌రిగింది..!
Film News

Siddharth: పెద్దావిడ కాళ్ల మీద ప‌డి క‌న్నీరు పెట్టుకున్న స్టార్ హీరో.. అస‌లేం జ‌రిగింది..!

Siddharth: సినిమా ఇండ‌స్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరో సిద్ధార్థ్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాయ్స్ సినిమాతో మ‌నోడు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. బాయ్స్ సినిమా కంటే ముందు ఇత‌ను స్టార్ డైరెక్టర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. అయితే డైరెక్టర్ కావాలనేది తన డ్రీమ్ కాగా, అనుకోని విధంగా న‌టుడిగా మారాడు.20 ఏళ్ల క్రితం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సిద్ధార్థ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న‌ ‘ఇండియన్2’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు.

ఇక సిద్ధార్థ్‌ నటించిన ‘టక్కర్’ మూవీ.. జూన్ 9న విడుదల కానుండ‌గా, గ‌త కొద్ది రోజులుగా మూవీ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే సిద్ధార్థ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా..ఆ స‌మ‌యంలో స్టేజిపైకి వచ్చిన ఓ పెద్దావిడ‌ని చూసి ఏడ్చేయడంతో పాటు కాళ్లమీద కూడా పడిపోయాడు. అనంతరం మాట్లాడిన సిద్ధార్థ్.. ఆమె లేక‌పోయి ఉంటే హీరోగా తనకు ఈ 20 ఏళ్ల కెరీర్ ఉండేది కాదని అన్నాడు. బాయ్స్ చిత్రం కోసం డైరెక్టర్‌ శంకర్‌కు తనను పరిచయం చేసింది సుజాతనే అని పేర్కొన్నాడు. ఈ సుజాత‌.. ప్రముఖ రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్, రంగరాజన్ వైఫ్.

 

సుజాత‌ని చూశాక అప్ప‌టి విష‌యాల‌ని గుర్తు చేసుకున్న సిద్ధార్థ్‌.. సుజాత అమ్మ నా గురించి శంకర్ సర్‌కి క‌నుక చెప్ప‌క‌పోయి ఉంటే.. నా జీవితం ఎలా ఉండేదో. ఇలా 20 ఏళ్ల ఫిలిం కెరీర్ కొనసాగేది కాదు. నిజంగా ఒక్క క్షణం ఆమెని చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. నేను సాధార‌ణంగా అంత సర్‌ప్రైజ్ అవ్వను కానీ ఇది మాత్రం నాకు సర్‌ప్రైజ్‌ను మించిన ఫీలింగ్ అనే చెప్పాలి. ఇక మణి సర్‌ను ఇప్పుడు అడిగినా సరే.. యాక్టింగ్ మీకు మంచిది కాదని చెబుతూ ఉంటారు. ఒకరకంగా అది నిజమే అయినా, దాన్ని ఆయన నామీద చూపే ప్రేమగా నేను తీసుకుంటాను’ అని సిద్ధార్థ్ స్ప‌ష్టం చేశారు.ఇక సిద్ధార్థ్ న‌టించిన‌ ‘టెస్ట్, సిద్ధ’ చిత్రాలు ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్నాయి. మ‌రోవైపు బొమ్మ‌రిల్లు హీరో అదితి రావు హైద‌రితో తెగ చెట్టాప‌ట్టాలు వేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...