Home Film News Jabardasth Comedian: ఎట్టకేల‌కి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయన్.. ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!
Film News

Jabardasth Comedian: ఎట్టకేల‌కి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయన్.. ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!

Jabardasth Comedian: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌లో త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచిన క‌మెడీయ‌న్ కెవ్వు కార్తీక్. ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న కెవ్వు కార్తీక్ ఇప్పుడు త‌న సోలో లైఫ్‌కి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆయ‌న త‌న పెళ్లి ఫొటో షేర్ చేయగా, అందులో సిరి అని సంబోధించారు. అయితే ఆమె అసలు పేరు శ్రీలేఖ అని స‌మాచారం. కెవ్వు కార్తీక్ వివాహం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. వీరి పెళ్లికి బుల్లి తెర సహనటులు, సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. వారు నూతన దంపతులను ఆశ్వీరదించారు.

మ‌రో జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ గెటప్ శ్రీను దంపతులు కూడా కెవ్వు కార్తీక్ పెళ్లికి హాజరయ్యారు. ఈ విషయాన్ని శ్రీను తన ఇన్ స్టా ఖాతాలో ఫోటో షేర్ చేసి..జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వరంగల్‌కు చెందిన కెవ్వుకార్తీక్.. త‌న చదువు పూర్తయ్యాక సినిమాలపై ఉన్న‌ మక్కువతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కామెడీ క్లబ్ తో కెరీర్‌ను స్టార్ చేసి ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల విడుదలైన నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో కూడా న‌టించి మెప్పించాడు. ఇందులో అత‌ని కామెడీ చాలా మందికి న‌చ్చేసింది.

 

చాలామంది మంచి స్థాయిలోకి వచ్చిన తరువాతే పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాడు. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకడు అని చెప్పాలి..జబర్థస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ అంద‌రి మ‌నసుల‌లో కెవ్వు కార్తీక్‌గా నిలిచిపోయాడు. ప్ర‌స్తుతానికి కెవ్వు కార్తీక్ పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కొత్త జంట కు శుభాకాంక్షలు చెబుతూ.. మెసేజ్ ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, కెవ్వు కార్లీక్ పెళ్లికి ముందే తన భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేశాడు . అయితే మొద‌ట ఫేస్ క‌నిపించ‌కుండా కాస్త స‌స్పెన్స్ లో పెట్టాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...